Stock market news today : ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 35 పాయింట్ల లాభం-stock market news today sensex nifty opens flat see top gainers and losers list here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today Sensex Nifty Opens Flat See Top Gainers And Losers List Here

Stock market news today : ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 35 పాయింట్ల లాభం

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 29, 2022 09:17 AM IST

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్లు ఫ్లాట్​గా ట్రేడ్​ అవుతున్నాయి. అమెరికా మార్కెట్లు సైతం నష్టాల్లోనే ముగిశాయి.

ఇండియా స్టాక్​ మార్కెట్​
ఇండియా స్టాక్​ మార్కెట్​

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​..  120పాయింట్లు పెరిగి 62,624 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​సీ నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 18,598 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

దేశీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో నూతన శిఖరాలకు చేరుకున్నాయి. రిలయన్స్​ షేర్లు ఇచ్చిన జోష్​తో.. నిఫ్టీ50.. ఆల్​టైమ్​ హైని తాకింది. చివరికి 50 పాయింట్లు లాభపడి 18,562 వద్ద ముగిసింది. ఇక బీఎస్​ఈ సెన్సెక్స్​.. 211 పాయింట్లు వృద్ధిచెంది 62,505 వద్ద స్థిరపడింది. 2023 డిసెంబర్​ నాటికి సెన్సెక్స్​ 80,000 మార్క్​కు చేరుతుందని ప్రముఖ బ్రోకరేజ్​ సంస్థ మోర్గాన్​ స్టాన్​లీ అభిప్రాయపడింది. ఇక మంగళవారం సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 62,362- 18,553 వద్ద మొదలుపెట్టాయి.

పివొట్​ ఛార్ట్​ ప్రకారం నిఫ్టీ సపోర్ట్​ 18,419- 18,361 లెవల్స్​ వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్​.. 18,609- 18,668 వద్ద ఉంది.

స్టాక్స్​ టు బై..

  • Stocks to buy list : విప్రో:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 490, టార్గెట్​ రూ. 530
  • పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 49, టార్గెట్​ రూ. 60
  • బ్రిటానియా:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 4150, టార్గెట్​ రూ. 4300-4340

పూర్తి లిస్ట్​ తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

లాభాలు.. నష్టాలు..

ఎస్​బీఐ, ఎన్​టీపీసీ, ఎం అండ్​ ఎం, టైటాన్​, ఎయిర్​టెల్​, యాక్సిస్​ బ్యాంక్​, ఎల్​ అండ్​ టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

నెస్లే, ఇండస్​ఇండ్​, విప్రో, హెచ్​డీఎఫ్​సీ, టీసీఎస్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, హెచ్​యూఎల్​, హెచ్​సీఎల్​ టెక్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు..

చైనాలో కొవిడ్​ సంక్షోభం, నిరసనల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై పడింది. ఫలితంగా అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

ఇక ఆసియా మార్కెట్లు సైతం నెగిటివ్​లోనే ఉన్నాయి. జపాన్​ నిక్కీ 0.84శాతం, ఎస్​ అండ్​ పీ 200.. 0.2శాతం నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

చమురు ధరలు..

ఏడాది కనిష్ఠానికి పడిన చమురు ధరలు.. అక్కడి నుంచి పెరిగాయి. బ్రెంట్​ క్రూడ్​ 44 సెంట్లు పెరిగి 83.19డాలర్లకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో.. రూ. 935.88కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు ఎఫ్​ఐఐలు. అదే సమయంలో డీఐఐలు.. 87.93కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

WhatsApp channel