Stock market news today : ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. 12 పాయింట్ల లాభంలో నిఫ్టీ-stock market news today sensex nifty opens flat amid positive global cues ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today, Sensex Nifty Opens Flat Amid Positive Global Cues

Stock market news today : ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. 12 పాయింట్ల లాభంలో నిఫ్టీ

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 14, 2022 09:16 AM IST

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్లు ఫ్లాట్​గా ఓపెన్​ అయ్యాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు ఫ్లాట్​గా ట్రేడ్​ అవుతున్నాయి.

ఇండియా స్టాక్​ మార్కెట్​
ఇండియా స్టాక్​ మార్కెట్​ (MINT_PRINT)

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 41పాయింట్ల నష్టంతో 61,753 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 12పాయింట్లు బలపడి 18,362 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిణామాలు నెలకొన్నాయి. ఫలితంగా శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ50.. 321 పాయింట్ల లాభంతో 18,350 వద్ద స్థిరపడింది. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 1,181 పాయింట్లు వృద్ధిచెంది 61,795 వద్ద ముగిసింది. బ్యాంక్​ నిఫ్టీ 2.13శాతం లాభాలతో 42,137 వద్దకు చేరింది. ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 61,767- 18376 వద్ద మొదలుపెట్టాయి.

పివొట్​ ఛార్ట్​ ప్రకారం.. నిఫ్టీ సపోర్ట్​ 18,284- 18,260 వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్​ 18,363- 18387 వద్ద ఉంది.

స్టాక్స్​ టు బై..

  • Stocks to buy : ఇన్ఫోసిస్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1540, టార్గెట్​ రూ. 1610-1630
  • రిలయన్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 2590, టార్గెట్​ రూ. 2680- 2700
  • ఐటీసీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 344, టార్గెట్​ రూ. 375

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

లాభాలు.. నష్టాలు..

పవర్​ గ్రిడ్​, ఎం అండ్​ ఎం, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, హెచ్​సీఎల్​ టెక్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

డా. రెడ్డీస్​, ఎయిర్​టెల్​, ఐసీఐసీఐ బ్యాంక్​, నెస్లే షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు..

US Stock markets : శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా మార్కెట్లు లాభపడ్డాయి. నాస్​డాక్​ 1.88శాతం, డౌ జోన్స్​ 0.1శాతం, ఎస్​ అండ్​ పీ 500.. 0.93శాతం వృద్ధిచెందింది.

ఆసియా మార్కెట్లు ఫ్లాట్​గా ఉన్నాయి. జపాన్​ నిక్కీ స్వల్ప లాభాల్లో ఉంది. సౌత్​ కొరియా కాస్పి 0.3శాతం లాభాల్లో ఉంది.

త్రైమాసిక ఫలితాలు..

ఓఎన్​జీసీ, గ్రాసిమ్​, బయోకాన్​, భారత్​ ఫోర్జ్​, అపోలో టైర్స్​, ఐఆర్​సీటీసీ, ఆర్తీ ఇండస్ట్రీస్​, ఆబాట్​ ఇండియా, బీజీఆర్​ ఎనర్జీ సిస్టెమ్స్​, బిర్లా టైర్స్​, సీఈఎస్​సీ, దిలిప్​ బిల్డ్​కాన్​, గోద్రేజ్​ ఇండస్ట్రీస్​తో పాటు ఇతర సంస్థల ఫలితాలు సోమవారం వెలువడున్నాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

Stock market news in telugu : శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు.. రూ. 3,958.23కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు.. 615.54కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

గత వారంలో ఎఫ్​ఐఐలు నెట్​ బయర్స్​గా మారి.. దేశీయ స్టాక్​ మార్కెట్​లో రూ. 6,330.17కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,255.91కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

WhatsApp channel

సంబంధిత కథనం