Stock market news today : దేశీయ సూచీలకు నష్టాలు.. నిఫ్టీ 70 పాయింట్లు డౌన్​-stock market news today sensex nifty open in red 21 november ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today, Sensex Nifty Open In Red 21 November

Stock market news today : దేశీయ సూచీలకు నష్టాలు.. నిఫ్టీ 70 పాయింట్లు డౌన్​

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 21, 2022 09:17 AM IST

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి.

ఇండియా స్టాక్​ మార్కెట్​
ఇండియా స్టాక్​ మార్కెట్​ (MINT_PRINT)

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాల్లో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 300పాయింట్ల నష్టంతో 61,363 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 79పాయింట్లు కోల్పోయి 18,229 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

బీఎస్​ఈ సెన్సెక్స్​.. 87పాయింట్ల నష్టంతో 61,663 వద్ద ముగిసింది. నిఫ్టీ50.. 33పాయింట్లు కోల్పోయి 18,308 వద్ద స్థిరపడింది. ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 61456- 18246 వద్ద మొదలుపెట్టాయి.

పివొట్​ ఛార్ట్​ ప్రకారం నిఫ్టీ సపోర్ట్​ 18,230- 18,190 లెవల్స్​ వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్​.. 18375- 18418 లెవల్స్​ వద్ద ఉంది.

ట్రేడింగ్​లో కెరీర్​ కోసం ప్రయత్నిస్తున్నారా? టిప్స్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

స్టాక్స్​ టు బై..

  • Stocks to buy today : ఇన్ఫోసిస్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1575, టార్గెట్​ రూ. 1615-1630
  • కోల్గోట్​ పాల్మోలివ్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1560, టార్గెట్​ రూ. 1610- 1625
  • రేణుక షుగర్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 49, టార్గెట్​ రూ. 65

పూర్తి లిస్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

లాభాలు.. నష్టాలు..

టాటా స్టీల్​, ఎయిర్​టెల్​, యాక్సిస్​ బ్యాంక్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

డా. రెడ్డీస్​, ఎం అండ్​ ఎం, టెక్​ఎం, నెస్లే, ఇన్ఫీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు..

US Stock markets : అమెరికా స్టాక్​ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.59శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.48శాతం, నాస్​డాక్​ 0.01శాతం వృద్ధిచెందాయి.

అమెరికా మార్కెట్​లో పెట్టుబడుల కోసం చూస్తున్నారా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. చైనాలో కొవిడ్​ నిబంధనల కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందేమో అన్న భయాలు మదుపర్లలో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జపాన్​ నిక్కీ 0.10శాతం నష్టాల్లో ఉంది. సౌత్​ కొరియా 0.4శాతం నష్టాల్లో కొనసాగుతోంది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు.. రూ. 751.20 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ. 890.45కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​పై పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఈ నెలలో ఇప్పటివరకు ఎఫ్​ఐఐలు.. రూ. 30వేల కోట్లను ఇండియా స్టాక్​ మార్కెట్​లో ఇన్​వెస్ట్​ చేశారు. అక్టోబర్​ నెలలో రూ.8 కోట్లను ఉపసంహరించుకున్నారు.

WhatsApp channel