Stock Market news today : స్టాక్​ మార్కెట్​లకు లాభాలు.. నిఫ్టీ 65 పాయింట్లు జంప్-stock market news today sensex and nifty opens on a positive note ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today Sensex And Nifty Opens On A Positive Note

Stock Market news today : స్టాక్​ మార్కెట్​లకు లాభాలు.. నిఫ్టీ 65 పాయింట్లు జంప్

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 23, 2023 09:17 AM IST

Stock Market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ఉన్నాయి. అమెరికా స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగిశాయి.

ఇండియా స్టాక్​ మార్కెట్​
ఇండియా స్టాక్​ మార్కెట్​ (MINT_PRINT)

Stock Market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాల్లో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 171 పాయింట్ల లాభంతో 60,792 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 67 పాయింట్లు పెరిగి 18,095 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

అమ్మకాల ఒత్తిడి కారణంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టపోయాయి. నిఫ్టీ50.. 80 పాయింట్ల నష్టంతో 18,027 వద్ద ముగిసింది. బీఎస్​ఈ సెన్సెక్స్​236 పాయింట్ల నష్టంతో 60,621 వద్ద స్థిరపడింది. ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 60875- 18119 వద్ద మొదలుపెట్టాయి.

పివోట్​ ఛార్ట్​ ప్రకారం నిఫ్టీ సపోర్ట్​ 18,104- 17,983- 17,934 వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్​ 18,112- 18,143- 18,192 వద్ద ఉంది.

స్టాక్స్​ టు బై..

గెయిల్​ ఇండియా:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 96, టార్గెట్​ రూ. 105

HDFC Bank share price target : హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్, స్టాప్​ లాస్​ రూ. 1630, టార్గెట్​ రూ. 1700- రూ. 1725

టాటా స్టీల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్, స్టాప్​ లాస్​ రూ. 114, టార్గెట్​ రూ. 132

పూర్తి లిస్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

లాభాలు.. నష్టాలు..

కొటాక్​ మహీంద్రా బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఎస్​బీఐ, టాటా మోటార్స్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

అల్ట్రాటెక్​ సిమెంట్​, బజాజ్​ ఫిన్​సర్వ్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్​లు..

ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు తీవ్రత తగ్గుతుందన్న అంచనాల మధ్య అమెరికా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం భారీగా లాభపడ్డాయి. డౌ జోన్స్​ 1శాతం, ఎస్​ అండ్​ పీ 500 1.89శాతం, నాస్​డాక్​ 2.69శాతం మేర లాభపడ్డాయి.

Reliance Industries Q3 results: రిలయన్స్​ క్యూ3 ఫలితాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆసియా మార్కెట్​లు మిశ్రమంగా ట్రేడ్​ అవుతున్నాయి. జపాన్​ నిక్కీ 1శాతం లాభాల్లో ఉంది. ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 స్వల్ప లాభాల్లో ఉంది. షాంఘై, హాంగ్​ కాంగ్​ సూచీలకు నేడు సెలవు.

త్రైమాసిక ఫలితాలు..

Axis Bank Q3 results : యాక్సిస్​ బ్యాంక్​, ఐడీబీఐ బ్యాంక్​, కెనెరా బ్యాంక్​, కంటైనర్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా, గ్లాండ్​ ఫార్మా, గ్రావిటీ ఇండియా, హెచ్​ఎఫ్​సీఎల్​, జమ్ముకశ్మీర్​ బ్యాంక్​, జిందాల్​ స్టెయిన్​లెస్​తో పాటు పలు సంస్థల క్యూ3 ఫలితాలు నేడు వెలువడనున్నాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2002.25కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1509.95కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం