Stock market news today : ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 10 పాయింట్ల లాభం-stock market news today sensex and nifty opens on a flat note ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today Sensex And Nifty Opens On A Flat Note

Stock market news today : ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 10 పాయింట్ల లాభం

Sharath Chitturi HT Telugu
Feb 20, 2023 09:16 AM IST

Stock market news today : ఇండియా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ఉన్నాయి. అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్​లు ఫ్లాట్​గా ఉన్నాయి.

ఇండియా స్టాక్​ మార్కెట్​
ఇండియా స్టాక్​ మార్కెట్​ (PTI)

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్ 94​ పాయింట్ల లాభంతో 61,097 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 11 పాయింట్లు పెరిగి 17,955 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పవనాల కారణంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టపోయాయి. 316 పాయింట్లు పడిన బీఎస్​ఈ సెన్సెక్స్​ 61,002 వద్ద ముగిసింది. 91 పాయింట్లు పతనమైన నిఫ్టీ.. 17,944 వద్ద స్థిరపడింది. 499 పాయింట్లు కోల్పోయిన బ్యాంక్​ నిఫ్టీ 41,131 వద్దకు చేరింది. ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 61,113- 17,965 వద్ద మొదలుపెట్టాయి.

స్టాక్స్​ టు బై..

Stocks to buy list : గోద్రేజ్​ కన్జ్యూమర్​ ప్రాడక్ట్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 925, టార్గెట్​ రూ. 960- రూ. 970

Berger paints share price target : బర్జర్​ పెయింట్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 555, టార్గెట్​ రూ. 580- రూ. 590

రాడికో ఖైతన్​:- బై రూ. 1125, స్టాప్​ లాస్​ రూ. 1105, టార్గెట్​ రూ. 1165

పూర్తి లిస్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

లాభాలు.. నష్టాలు..

Stock market news : పవర్​ గ్రిడ్​, ఎల్​టీ, సన్​ఫార్మా, భారతీ ఎయిర్​టెల్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

విప్రో, హెచ్​సీఎల్​ టెక్​, ఎన్​టీపీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్​లు..

ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు తీవ్రత కొనసాగుతుందన్న భయం మదుపర్లలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. అమెరికా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.39శాతం లాభపడగా.. ఎస్​ అండ్​ పీ 500 0.28శాతం, నాస్​డాక్​ 0.58శాతం మేర నష్టపోయాయి.

US Stock market investment in Telugu : ఆసియా మార్కెట్​లు ఫ్లాట్​గా ఉన్నాయి. జపాన్​ నిక్కీ 0.02శాతం నష్టాల్లో ఉంది. సౌత్​ కొరియా కాస్పీ 0.3శాతం లాభాల్లో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 0.2శాతం నష్టాల్లో ట్రేడ్​ అవుతోంది.

చమురు ధరలు..

చమురు ధర 2.14 డాలర్లు పడి బ్యారెల్​కు 83 డాలర్ల వద్దకు చేరింది. ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం దీనిపై కొనసాగుతోంది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడంగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 624.61కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు కూడా రూ. 85.29కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.

కాగా.. దేశీయ స్టాక్​ మార్కెట్​లో ఎఫ్​ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 1,408.36కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.

WhatsApp channel