Stock market news today : లాభాల్లో స్టాక్​ మార్కెట్​లు.. నిఫ్టీ 80 పాయింట్లు జంప్​-stock market news today 9th january 2023 sensex and nifty opens on a positive note ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today 9th January 2023 Sensex And Nifty Opens On A Positive Note

Stock market news today : లాభాల్లో స్టాక్​ మార్కెట్​లు.. నిఫ్టీ 80 పాయింట్లు జంప్​

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 09, 2023 09:17 AM IST

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్​లు భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్​లు సైతం భారీ లాభాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

ఇండియా స్టాక్​ మార్కెట్​
ఇండియా స్టాక్​ మార్కెట్​

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 271 పాయింట్ల లాభంతో 60,171 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 17,943 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాలతో ముగించాయి. నిఫ్టీ 132 పాయింట్లు కోల్పోయి 17,859 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్​.. 452 పాయింట్ల నష్టంతో 59,900 వద్ద ముగిసింది. 419 పాయింట్లు కోల్పోయిన బ్యాంక్​ నిఫ్టీ.. 42,188కు చేరింది. ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 60147- 17953 వద్ద మొదలుపెట్టాయి.

పివోట్​ ఛార్ట్స్​ ప్రకారం.. నిఫ్టీ సపోర్ట్​ 17,805- 17,745- 17,649 లెవల్స్​ వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్​.. 17,997- 18,056- 18,153 లెవల్స్​ వద్ద ఉంది.

స్టాక్స్​ టు బై..

Stocks to buy today : ఓఎన్​జీసీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 144, టార్గెట్​ రూ. 152- రూ. 155

బజాజ్​ ఆటో:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 3575, టార్గెట్​ రూ. 3725- రూ. 3750

స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఎస్​బీఐ):- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 584, టార్గెట్​ రూ. 625

పూర్తి లిస్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

లాభాలు.. నష్టాలు..

బజాజ్​ ఫిన్​సర్వ్​, సన్​ఫార్మా, భారతీ ఎయిర్​టెల్​, టాటా స్టీల్​, టాటా మోటార్స్​, టీసీఎస్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఇన్ఫీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్​లు..

US Stock markets news : శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను అమెరికా స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాలతో ముగించాయి! ద్రవ్యోల్బణం తగ్గుతోందని, వడ్డీ రేట్ల పెంపు విషయంలో.. ఫెడ్​ అంత తీవ్రంగా ఉండాల్సిన అవసరం లేదని వస్తున్న వార్తల మధ్య.. మదుపర్లు కొనుగోళ్లవైపు మొగ్గు చూపారు.

డౌ జోన్స్​ 2.13శాతం, ఎస్​ అండ్​ పీ 500 2.28శాతం, నాస్​డాక్​ 2.56శాతం మేర లాభపడ్డాయి.

అమెరికా మార్కెట్​ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో ఆసియా స్టాక్​ మార్కెట్​లు లభాల్లో ట్రేడ్​ అవుతున్నాయి. పాన్​ నిక్కీ 0.6శాతం, సౌత్​ కొరియా కాస్పి 1.1శాతం మేర లాభపడ్డాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు.. రూ. 2902.46కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు.. రూ. 1083,17కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం