Stock market news today: స్టాక్ మార్కెట్లు సోమవారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఈ ఉదయం 385 పాయింట్లు పెరిగి 81,335 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 107 పాయింట్లు పెరిగి 18,224 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫిన్‌సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, రిలయన్స్, హెచ్‌యూఎల్, సన్ ఫార్మా, తదితర స్టాక్స్ ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ, ఇండస్ ఇండ్, కోటక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్ తదితర స్టాక్స్ ఉన్నాయి.
Pre-market opening session: ప్రి మార్కెట్ ఓపెనింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 236 పాయింట్లు బలపడి61,186.81 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 94.60 పాయింట్లు బలపడి 18,211 పాయింట్ల వద్ద స్థిరపడింది.
కాగా శుక్రవారం ఉదయం స్టాక్స్ నిలకడగా ట్రేడవుతూ మధ్యాహ్నానికి ప్రతికూల స్థాయికి వెళ్లి, ఆపై నష్టాల నుంచి కోలుకుని లాభాలతో ముగిశాయి. శుక్రవారం బిఎస్‌ఇ సెన్సెక్స్ 113.95 పాయింట్లు లాభపడి 60,950.36 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 64.45 పాయింట్లు పెరిగి 18,117 వద్ద ముగిసింది.
యుఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేట్లను పెంచడం, ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు పెంచడం కారణంగా శుక్రవారం స్టాక్ మార్కెట్‌లో అస్థిరత కనిపించింది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన తాజా ద్రవ్య విధాన సమావేశంలో కీలక పాలసీ రేటును 75 బేసిస్ పాయింట్లు పెంచి వడ్డీ రేట్లను దశాబ్ద కాలం గరిష్ఠ స్థాయికి చేర్చింది. ఈ స్థాయిలో ఇది వరుసగా నాలుగో పెంపు కావడం గమనార్హం.
టాపిక్