Stock market news today : లాభాల్లో స్టాక్​ మార్కెట్​లు- నిఫ్టీ 120 పాయింట్లు జంప్​-stock market news today 6th march 2023 sensex and nifty opens on a positive note ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today 6th March 2023 Sensex And Nifty Opens On A Positive Note

Stock market news today : లాభాల్లో స్టాక్​ మార్కెట్​లు- నిఫ్టీ 120 పాయింట్లు జంప్​

Sharath Chitturi HT Telugu
Mar 06, 2023 09:19 AM IST

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ఉన్నాయి. అమెరికా స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగిశాయి.

ఇండియా స్టాక్​ మార్కెట్​
ఇండియా స్టాక్​ మార్కెట్​ (REUTERS)

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 460 పాయింట్ల లాభంతో 60,269 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 132 పాయింట్లు పెరిగి 17,726 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

అంతర్జాతీయ సానుకూల పరిస్థితులు, అదానీ గ్రూప్​ స్టాక్స్​లో కొనుగోళ్ల జోరు కారణంగా దేశీయ సూచీలు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీ లాభాలను నమోదు చేశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్ 899 పాయింట్లు పెరిగి 59,808 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 272 పాయింట్ల లాభంతో 17,594 వద్దకు చేరింది.​ ఇక బ్యాంక్​ నిఫ్టీ 861 పాయింట్లు బలపడి 41,251 మార్క్​ను తాకింది. ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 60,007- 17,680 వద్ద మొదలుపెట్టాయి.

స్టాక్స్​ టు బై..

Titan share price target : టైటాన్​ కంపెనీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 2360, టార్గెట్​ రూ. 2430- రూ. 2450

Airtel share price target : భారతీ ఎయిర్​టెల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 745, టార్గెట్​ రూ. 790- రూ. 800

Tata Motors share price target : టాటా మోటార్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 414, టార్గెట్​ రూ. 440

పూర్తి లిస్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

లాభాలు.. నష్టాలు..

పవర్​గ్రిడ్​, టాటా మోటార్స్​, ఎస్​బీఐ, ఇన్ఫీ, ఐసీఐసీఐబ్యాంక్​, హెచ్​సీఎల్​టెక్​, ఎన్​టీపీసీ, టెక్​ఎం, ఐటీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఎం అండ్​ ఎం, సన్​ఫార్మా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్​లు..

US Stock market investment tips in Telugu : అమెరికా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీగా లాభపడ్డాయి. డౌ జోన్స్​ 1.17శాతం, ఎస్​ అండ్​ పీ 500 1.61శాతం, నాస్​డాక్​ 1.97శాతం మేర పెరిగాయి.

ఆసియా మార్కెట్​లు సైతం లాభాల్లోనే ఉన్నాయి. జపాన్​ నిక్కీ 1శాతం, సౌత్​ కొరియా కాస్పి 0.6శాతం మేర లాభపడ్డాయి.

చమురు ధరలు..

చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్​ క్రూడ్​ 1.01డాలర్లు పెరిగి బ్యారెల్​కు 85.76 డాలర్లకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

Stock market news in Telugu : శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 246.24కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు సైతం రూ. 2089.92కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

WhatsApp channel