Stock market news today : ఫ్లాట్‌గా దేశీయ స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 20 పాయింట్లు డౌన్
Stock market news today : ఇండియా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ఉన్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ను ఫ్లాట్‌గా ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 24పాయింట్లు కోల్పోయి 62,822 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 20 పాయింట్ల నష్టంతో 18,580 వద్ద కొనసాగుతోంది.
ట్రెండింగ్ వార్తలు
అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిస్థితుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ను లాభాల్లో ముగించాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 99 పాయింట్లు పెరిగి 18,598 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 344 పాయింట్లు వృద్ధిచెంది 62,846 వద్ద ముగిసింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 44,312 వద్దకు చేరింది. ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 62,836- 18,607 వద్ద మొదలుపెట్టాయి.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ చాలా బుల్లిష్‌గా ఉంది!
స్టాక్స్ టు బై..
లుపిన్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 778, టార్గెట్ రూ. 848
బ్లూ స్టార్:- బై రూ. 1471.25, స్టాప్ లాస్ రూ. 1425, టార్గెట్ రూ. 1560
Tata steel share price target : టాటా స్టీల్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్ (రూ.108), స్టాప్ లాస్ రూ. 103, టార్గెట్ రూ. 117
పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లాభాలు.. నష్టాలు..
టైటాన్, ఎం అండ్ ఎం, పవర్‌గ్రిడ్, మారుతీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
టెక్ఎం, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్‌ఫార్మా, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
ఇదీ చూడండి:- Q4 Results this week: ఈ వారం ఫలితాలను వెల్లడించనున్న ముఖ్యమైన కంపెనీలు ఇవే.. అదానీ పోర్ట్స్, ఐఆర్సీటీసీ సహా మరిన్ని..
అంతర్జాతీయ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి! డౌ జోన్స్ 1శాతం, ఎస్ అండ్ పీ 500 1.3శాతం, నాస్డాక్ 2.19శాతం మేర వృద్ధిచెందాయి.
ఆసియా మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1758.16కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు సైతం రూ. 853.57 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
సంబంధిత కథనం