Stock market news today : ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. నిఫ్టీ 16 పాయింట్లు డౌన్​-stock market news today 2nd march 2023 sensex and nifty opens on a flat note ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today 2nd March 2023 Sensex And Nifty Opens On A Flat Note

Stock market news today : ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. నిఫ్టీ 16 పాయింట్లు డౌన్​

Sharath Chitturi HT Telugu
Mar 02, 2023 09:17 AM IST

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ఉన్నాయి. ఆసియా మార్కెట్​లు లాభాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి.

ఇండియా స్టాక్​ మార్కెట్​
ఇండియా స్టాక్​ మార్కెట్​ (REUTERS)

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 7పాయింట్ల లాభంతో 59,419 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 16 పాయింట్ల నష్టంతో  17435 వద్ద కొనసాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

వరుస నష్టాలకు బ్రేక్​ పెడుతూ.. దేశీయ స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 448 పాయింట్ల లాభంతో 59,411 వద్ద స్థిరపడింది. 146 పాయింట్లు పెరిగిన నిఫ్టీ.. 17,450 వద్దకు చేరింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 429 పాయింట్లు లాభపడి.. 40,698 వద్ద ముగిసింది. ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 59287- 17422 వద్ద మొదలుపెట్టాయి.

స్టాక్స్​ టు బై..

LIC share price target : లైఫ్​ ఇన్ష్యూరెన్స్​ కార్పొరేషన్​ (ఎల్​ఐసీ):- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 584, టార్గెట్​ రూ. 640

SBI share price target : స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఎస్​బీఐ):- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 516, టార్గెట్​ రూ. 565

హావెల్స్​ ఇండియా:- బై రూ. 1216, స్టాప్​ లాస్​ రూ. 1180, టార్గెట్​ రూ. 1260

పూర్తి లిస్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

లాభాలు.. నష్టాలు..

బజాజ్​ ఫిన్​సర్వ్​, యాక్సిస్​ బ్యాంక్​, ఎల్​టీ, టాటా స్టీల్​, ఎం అండ్​ ఎం షేర్లు లాభాల్లో ఉన్నాయి. 

హెచ్​సీఎల్​ టెక్​, హెచ్​డీఎఫ్​సీ, టెక్​ఎం, భారతీ ఎయిర్​టెల్​, నెస్లే, రిలయన్స్​, టీసీఎస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ షేర్లు నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్​లు..

US Stock market investment tips in telugu : అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.02శాతం లాభపడింది. ఎస్​ అండ్​ పీ 500 0.4శాతం, నాస్​డాక్​ 0.6శాతం మేర నష్టపోయాయి.

ఆసియా మార్కెట్​లు లాభాల్లో ట్రేడ్​ అవుతున్నాయి. ఎర్లీ ట్రేడ్​లో సౌత్​ కొరియా కాస్పి 0.91శాతం లాభపడింది. జపాన్​ నిక్కీ 0.11శాతం, ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 0.3శాతం లాభాల్లో ఉన్నాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 424.88కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1498.66కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

WhatsApp channel