Stock market news today : లాభాల్లో దేశీయ సూచీలు..​ నిఫ్టీ 30 పాయింట్లు అప్​-stock market news today 28 october 2022 sensex nifty gains ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today 28 October 2022 Sensex, Nifty Gains

Stock market news today : లాభాల్లో దేశీయ సూచీలు..​ నిఫ్టీ 30 పాయింట్లు అప్​

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Oct 28, 2022 09:18 AM IST

Stock market news today : దేశీయ సూచీలు లాభాల్లో ఓపెన్​ అయ్యాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

స్టాక్​ మార్కెట్​ ఇండియా
స్టాక్​ మార్కెట్​ ఇండియా (REUTERS)

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 142 పాయింట్ల లాభంతో 59,899 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 37 పాయింట్లు వృద్ధి చెంది 17,774 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో స్టాక్​ మార్కెట్లు లాభపడ్డాయి. నిఫ్టీ50.. 80 పాయింట్ల లాభంతో 17,736 వద్ద ముగిసింది. బీఎస్​ఈ సెన్సెక్స్​ 212 పాయింట్లు పెరిగి 59,756 వద్ద స్థిరపడింది. రియాల్టీ, గ్యాస్​, మెటల్స్​, పవర్​ సెక్టార్​ స్టాక్స్​ లాభపడ్డాయి. ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు 59,747- 17,756 వరుసగా వద్ద మొదలుపెట్టాయి.

పివొట్​ ఛార్ట్​ ప్రకారం నిఫ్టీ సపోర్టు 17,676- 17645 లెవల్స్​ వద్ద ఉంది. ఇక నిఫ్టీ రెసిస్టెన్స్​ 17,774- 17,805 వద్ద ఉంది.

స్టాక్స్​ టు బై..

  • Stocks to buy : సన్​ ఫార్మా:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 900, టార్గెట్​ రూ. 1030- 1050
  • టాటా స్టీల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 100, టార్గెట్​ రూ. 108-110
  • కోల్​ ఇండియా:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 225, టార్గెట్​ రూ. 265

పూర్తి లిస్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

లాభాలు.. నష్టాలు..

రిలయన్స్​, ఏషియన్​ పెయింట్స్​, ఎయిర్​టెల్​, ఎం అండ్​  ఎం షేర్లు లాభాల్లో ఉన్నాయి.

సన్​ఫార్మా, యాక్సిస్​ బ్యాంక్​, హెచ్​సీఎల్​ టెక్​, టీసీఎస్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు..

టెక్​ సంస్థల త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండటంతో అమెరికా నాస్​డాక్​ సూచీ నష్టాల్లో ముగిసింది. డౌ జోన్స్​ 0.61శాతం లాభపడగా, ఎస్​ అండ్​ పీ 500 0.61శాతం- నాస్​డాక్​ 1.63శాతం నష్టాల్లో ముగిశాయి.

ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. జపాన్​ నిక్కీ 0.63శాతం, ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 0.49శాతం నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

చమురు ధరలు..

చమురు ధరలు పెరిగాయి. క్రూడ్​ ధర 1.27 డాలర్లు పెరిగి.. బ్యారెల్​కు 96.96 డాలర్లకు చేరింది.

త్రైమాసిక ఫలితాలు..

Maruti Suzuki Q2 results : మారుతీ సుజుకీ ఇండియా, డా. రెడ్డీస్​, జేఎస్​డబ్ల్యూ ఎనర్జీ, వేదాంత, టాటా పవర్​, బంధన్​ బ్యాంక్​, బ్లూ డార్ట్​ ఎక్స్​ప్రెస్​, సీసీఎల్​ ప్రాడక్ట్స్​, ఎవరేడీ ఇండస్ట్రీస్​ ఇండియా, ఎన్​ఐఐటీ, సటిన్​ క్రెడిట్​కేర్​ నెట్​వర్క్​, సోనా బీఎల్​డబ్ల్యూ ప్రెసిషన్​ ఫార్జింగ్స్​తో పాటు ఇతర సంస్థల త్రైమాసిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి.

ఐఓసీ, ఎన్​టీపీసీ, అలంకిట్​, హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్​తో పాటు ఇతర సంస్థల త్రైమాసిక ఫలితాలు శనివారం వెలువడనున్నాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో రూ. 2,810.40కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు ఎఫ్​ఐఐలు. అదే సమయంలో డీఐఐలు.. రూ. 1,580.10కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

WhatsApp channel

సంబంధిత కథనం