Stock market news today : నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు- నిఫ్టీ.. 45 పాయింట్లు డౌన్​-stock market news today 28 november sensex nifty opens on a negative note ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today 28 November, Sensex Nifty Opens On A Negative Note

Stock market news today : నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు- నిఫ్టీ.. 45 పాయింట్లు డౌన్​

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 28, 2022 09:18 AM IST

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు ఫ్లాట్​గా ముగిశాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

ఇండియా స్టాక్​ మార్కెట్​
ఇండియా స్టాక్​ మార్కెట్​

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాల్లో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​..  137పాయింట్లు కోల్పోయి 62,156 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ50​.. 48 పాయింట్ల నష్టంతో 18,465 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

దేశీయ స్టాక్​ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 20పాయింట్ల లాభంతో 62,293 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 28 పాయింట్లు పెరిగి 18,512 వద్ద ముగిసింది. 91పాయింట్ల నష్టంతో 43,000 మార్కు దిగువన స్థిరపడింది బ్యాంక్​ నిఫ్టీ. ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 62,016- 18,431 వద్ద మొదలుపెట్టాయి.

పివొట్​ ఛార్ట్​ ప్రకారం.. నిఫ్టీ సపోర్ట్​ 18,463- 18,442 లెవల్స్​ వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్​ 18,532- 18553 లెవల్స్​ వద్ద ఉంది. ఈ వారంలో.. నిఫ్టీ ఆల్​ టైమ్​ హై(18,606)ని తాకుతుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

స్టాక్స్​ టు బై..

Stocks to buy : దివీస్​ ల్యాబ్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 3270, టార్గెట్​ రూ. 3450

ఐషేర్​ మోటార్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 3350, టార్గెట్​ రూ. 3500

విప్రో:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 388, టార్గెట్​ రూ. 425

పూర్తి లిస్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

లాభాలు.. నష్టాలు..

మారుతీ, అలట్రాటెక్​ సిమెంట్​, విప్రో, ఎల్​ అండ్​ టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

స్టాక్​ మార్కెట్లు పెరుగుతున్నా.. మీ పోర్ట్​ఫోలియో వృద్ధిచెందడం లేదా? అసలు కారణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

అంతర్జాతీయ మార్కెట్లు..

US Stock market investment : అమెరికా మార్కెట్లు.. శుక్రవారం ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.46శాతం లాభపడింది. ఎస్​ అండ్​ పీ500 0.03శాతం, నాస్​డాక్​ 0.52శాతం నష్టపోయాయి.

చైనాలో కొవిడ్​ సంక్షోభం ఆందోళనను కలిగిస్తోంది. ఈ పరిణామాలు ఆసియా మార్కెట్లకు కాస్త ప్రతికూలంగా మారాయి. జపాన్​ నిక్కీ 0.3శాతం నష్టాల్లో ఉంది. ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 0.47శాతం పతనమైంది.

చమురు ధరలు..

చైనాలో అస్థిరత ప్రభావం చమురు ధరలపై పడింది. బ్రెంట్​ క్రూడ్​.. బ్యారెల్​కు 0.16 సెంట్లు పడి.. 83.48 డాలర్లకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

FII investments in India Equity : శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు.. రూ. 369.08కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు.. రూ. 295.92కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

ఇక ఎఫ్​ఐఐలు.. నవంబర్​ నెలల్​ ఇప్పటివరకు రూ. 31,630కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు తీవ్రత తగ్గుతుందన్న అంచనాలు.. మార్కెట్​కు సానుకూలంగా పని చేసింది. కాగా.. అక్టోబర్​లో రూ. 8కోట్లు, సెప్టెంబర్​లో రూ. 7,625కోట్లు పెట్టుబడి పెట్టారు ఎఫ్​ఐఐలు.

WhatsApp channel

సంబంధిత కథనం