Stock market news today : ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 19పాయింట్ల లాభం-stock market news today 22 november nifty sensex opens flat ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today 22 November Nifty Sensex Opens Flat

Stock market news today : ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 19పాయింట్ల లాభం

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 22, 2022 09:18 AM IST

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్లు ఫ్లాట్​గా ఓపెన్​ అయ్యాయి. అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి.

ఇండియా స్టాక్​ మార్కెట్​
ఇండియా స్టాక్​ మార్కెట్​

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​..  64పాయింట్ల లాభంతో 61,209 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ50.. 19పాయింట్లు వృద్ధి చెంది 18,179 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు నష్టపోయాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 519పాయింట్లు కోల్పోయి 61,145 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 148 పాయింట్ల నష్టంతో 18,160 వద్ద ముగిసింది. బీఎస్​ఈ మిడ్​క్యాప్​ 0.15శాతం పతనమవ్వగా.. స్మాల్​ క్యాప్​ సూచీ 0.01శాతం పెరిగింది. ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 61,127- 18,179 వద్ద మొదలుపెట్టాయి.

పివొట్​ ఛార్ట్​ ప్రకారం.. నిఫ్టీ సపోర్ట్​ 18,136- 18,105 వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్​ 18,234- 18265 వద్ద ఉంది.

స్టాక్స్​ టు బై..

  • Stocks to buy today : వేదాంత:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 295, టార్గెట్​ రూ. 325
  • యాక్సిస్​ బ్యాంక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 854, టార్గెట్​ రూ. 892
  • హెచ్​డీఎఫ్​సీ లైఫ్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 520, టార్గెట్​ రూ. 554
  • అపోలో టైర్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 274, టార్గెట్​ రూ. 292

పూర్తి లిస్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

లాభాలు.. నష్టాలు..

యాక్సిస్​ బ్యాంక్​, కొటాక్​ బ్యాంక్​, ఎయిర్​టెల్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

 హెచ్​సీఎల్​ టెక్​, పవర్​గ్రిడ్​, టీసీఎస్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు..

US Stock markets : చైనా కొవిడ్​ ఆంక్షలు.. అంతర్జాతీయ మార్కెట్​పై ప్రతికూల ప్రభావం చుపించింది. ఫలితంగా అమెరికా మార్కెట్లు స్వల్పంగా నష్టపోయాయి. డౌ జోన్స్​ 0.13శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.39శాతం, నాస్​డాక్​ 1.09శాతం పడిపోయాయి.

ఆసియా మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో స్వల్పంగా పెరిగాయి. జపాన్​ నిక్కీ 0.6శాతం లాభాల్లో ఉంది. ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 0.5శాతం వృద్ధిచెందింది. అదే సమయంలో సౌత్​ కొరియా కాస్పి.. 0.34శాతం పడిపోయింది.

చమురు ధరలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో చమురు ధరలు భారీగా పతనమై.. అనంతరం కోలుకున్నాయి. బ్రెంట్​ క్రూడ్​.. 17సెంట్లు పడిపోయి 87.45డాలర్లకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,593.83కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,262.91కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం