Stock Market news: స్టాక్‌మార్కెట్లకు లక్ష్మీవారం.. సెన్సెక్స్ 200 అప్
Stock Market news today: స్టాక్‌మార్కెట్లకు ఈ శుక్రవారం లక్ష్మీవారమే అవుతోంది. వరుసగా ఆరో సెషన్‌లోనూ మదుపరులకు లాభాలను మిగిల్చే సంకేతాలతో స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభమైంది.
Stock Market news today: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 211 పాయింట్లు పెరిగి 59,411.81 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 57.15 పాయింట్లు పెరిగి 17,621 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
Top gainer stocks: టాప్ గెయినర్స్ జాబితా ఇదే
టాప్ గెయినర్స్ జాబితాలో హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, నెస్లే, భారతీ ఎయిర్ టెల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ తదితర స్టాక్స్ ఉన్నాయి.
Top loser stocks: టాప్ లూజర్స్ జాబితా ఇదే
టాప్ లూజర్స్ జాబితాలో పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర స్టాక్స్ ఉన్నాయి.
Pre-market opening session: ప్రి మార్కెట్ ఓపెనింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 178.46 పాయింట్లు పెరిగి 59,381.38 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 58.90 పాయింట్లు పెరిగి 17,622.85 పాయింట్ల వద్ద స్థిరపడింది.
గురువారం వరుసగా ఐదో సెషన్‌లో బెంచ్‌మార్క్ సూచీలు లాభపడ్డాయి. ఓవర్సీస్‌లో ఎక్కువగా డౌన్‌బీట్ ట్రెండ్ ఉన్నప్పటికీ ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభాల బాట పట్టాయి. రూపాయి స్వల్ప రికవరీ కూడా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచింది. అస్థిరత మధ్య సెన్సెక్స్ 95.71 పాయింట్లు (0.16 శాతం) పెరిగి 59,202.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 51.70 పాయింట్లు (0.30 శాతం) పెరిగి 17,563.95 వద్దకు చేరుకుంది.
రూపాయి నిన్న తన జీవితకాల కనిష్ట స్థాయి నుండి పుంజుకుంది. డాలర్‌తో పోల్చినప్పుడు రూపాయి విలువ 21 పైసలు పెరిగి 82.79 వద్ద ముగిసింది. సెషన్‌లో 83.29 కనిష్ట స్థాయికి పతనమైన రూపాయి విలువ.. రిజర్వ్ బ్యాంక్ జోక్యంతో స్థానిక కరెన్సీ కోలుకున్నట్లు ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం కారణంగా రూపాయి విలువ తగ్గిందని వారు తెలిపారు.
టాపిక్