Stock market news: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
Stock market news today: స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
Stock market news today: స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 219 పాయింట్లు తగ్గి 58.887 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 75 పాయింట్లు నష్టపోయి 17,436 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
Top gainer stocks: టాప్ గెయినర్స్ జాబితా ఇదే
టాప్ గెయినర్స్ జాబితాలో హిందుస్తాన్ యూనీ లివర్, నెస్లే ఇండియా, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్ తదితర స్టాక్స్ ఉన్నాయి.
Top loser stocks: టాప్ లూజర్స్ జాబితా ఇదే
టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, మారుతీ సుజుకీ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ , హెచ్‌డీఎఫ్‌సీ, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, టైటాన్, కోటక్ బ్యాంక్, తదితర స్టాక్స్ ఉన్నాయి.
Pre-market opening session: ప్రి మార్కెట్ ఓపెనింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 282.71 పాయింట్లు కోల్పోయి 58,824.48 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 89.15 పాయింట్లు కోల్పోయి 17,423.10 పాయింట్ల వద్ద స్థిరపడింది.
నిన్న సెన్సెక్స్ 147 పాయింట్లు పెరిగి 59,107.19 వద్ద ముగియగా, నిఫ్టీ 50 25 పాయింట్లు పెరిగి 17,512.25 వద్ద ముగిసింది. భారతీయ స్టాక్ సూచీలు బుధవారం వరుసగా నాలుగో సెషన్‌లో లాభాలు తెచ్చిపెట్టాయి.
ఇక రూపాయి సరికొత్త జీవితకాలపు కనిష్టానికి పడిపోయింది. విదేశీ మూలధనం వెనక్కి మళ్లడం, డాలర్ మరింత పటిష్టంగా మారడం వంటి కారణాల మధ్య బుధవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 60 పైసలు పతనమై 83కు దిగజారింది.
దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం, రిస్క్ లేని పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు మళ్లడం రూపాయిపై ప్రభావం చూపాయని ట్రేడర్లు తెలిపారు.
నేడు పరిశీలించాల్సిన స్టాక్స్
- హైడ్రోజన్ ఇంధన కణాల తయారీకి సంబంధించి ట్రైటన్ ఎలక్ట్రిక్ వెహికల్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తెలిపింది.
- 1:5 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీని తమ బోర్డు ఆమోదించిందని 7NR రిటైల్ లిమిటెడ్ తెలిపింది.
- షాపర్స్ స్టాప్ లిమిటెడ్ సెప్టెంబర్-త్రైమాసికంలో 18.14 కోట్ల రూపాయల నికర లాభాన్ని నివేదించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 3.03 కోట్ల రూపాయల నష్టం చూపింది.
- చక్కెర, రసాయనాలు ఉత్పత్తి చేసే డీసీఎం శ్రీరామ్ లిమిటెడ్ కంపెనీ బుధవారం రెండో త్రైమాసికంలో 19.2% మేర లాభం తగ్గినట్టు నివేదించింది.
- ప్రైవేట్ బ్యాంకు ఇండస్‌ఇండ్ బ్యాంక్ బుధవారం రెండో త్రైమాసిక లాభంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు సాధించింది. బలమైన రుణ వృద్ధి, మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గడం వంటి కారణాల వల్ల లాభాలు పెరిగాయి.
టాపిక్