Stock market news today : స్టాక్​ మార్కెట్​లకు లాభాలు.. నిఫ్టీ 60 పాయింట్లు జంప్-stock market news today 1st march 2023 sensex and nifty opens on a positive note ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today 1st March 2023 Sensex And Nifty Opens On A Positive Note

Stock market news today : స్టాక్​ మార్కెట్​లకు లాభాలు.. నిఫ్టీ 60 పాయింట్లు జంప్

Sharath Chitturi HT Telugu
Mar 01, 2023 09:19 AM IST

Stock market news today : ఇండియా స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్​లు నష్టాల్లో ముగిశాయి.

ఇండియా స్టాక్​ మార్కెట్​
ఇండియా స్టాక్​ మార్కెట్​

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 266 పాయింట్ల లాభంతో 59,228 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 63 పాయింట్లు పెరిగి 17,367 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

దేశీయ స్టాక్​ మార్కెట్​లు వరుసగా గత 8 ట్రేడింగ్​ సెషన్​లో నష్టాలను నమోదు చేశాయి. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో సెన్సెక్స్​ 326 పాయింట్లు కోల్పోయి 58,962 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 89 పాయింట్ల నష్టంతో 17,304 వద్ద ముగిసింది. బ్యాంక్​ నిఫ్టీలో అమ్మకాల ఒత్తిడి కాస్త తగ్గింది. ఇక ఫిబ్రవరిని నిఫ్టీ 2శాతం మేర నష్టాలతో ముగించింది. ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 59,136- 17,360 వద్ద మొదలుపెట్టాయి.

స్టాక్స్​ టు బై..

ఐఈఎక్స్​:- బై రూ. 144, స్టాప్​ లాస్​ రూ. 137, టార్గెట్​ రూ. 152

Tata Power share price target : టాటా పవర్​:- బై రూ. 202, స్టాప్​ లాస్​ రూ. 196, టార్గెట్​ రూ. 210

పాలీక్యాబ్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 3000, టార్గెట్​ రూ. 3150- రూ. 3170

Pidilite Industries share price target : పిడిలైట్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 2260, టార్గెట్​ రూ. 2350- రూ. 2360

Asian paints share price target : ఏషియన్​ పెయింట్స్​:- బై రూ. 2828, స్టాప్​ లాస్​ రూ. 2790, టార్గెట్​ రూ. 2910

పూర్తి లిస్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

లాభాలు.. నష్టాలు..

టాటా స్టీల్​, ఎం అండ్​ ఎం, టీసీఎస్​, టాటా మోటార్స్​, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐబ్యాంక్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఇండస్​ఇండ్​, ఐటీసీ, పవర్​గ్రిడ్​, టెక్​ఎం షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్​లు..

US Stock market investment in Telugu : అమెరికా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం నష్టపోయాయి. డౌ జోన్స్​ 0.71శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.3శాతం, నాస్​డాక్​ 0.1శాతం మేర పతనమయ్యాయి.

ఆసియా మార్కెట్​లు నష్టాల్లో ఉన్నాయి. ఎర్లీ ట్రేడ్​లో ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 0.5శాతం నష్టపోయింది. జపాన్​ నిక్కీ 0.11శాతం నష్టాలతో ప్రారంభమైంది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4559.21కోట్లు విలువ చేస షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ. 4609.87కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం