Stock market news today : భారీ నష్టాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీ 100 పాయింట్లు డౌన్-stock market news today 17 feb 2023 sensex and nifty opens on a negative note ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today 17 Feb 2023 Sensex And Nifty Opens On A Negative Note

Stock market news today : భారీ నష్టాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీ 100 పాయింట్లు డౌన్

Sharath Chitturi HT Telugu
Feb 17, 2023 09:18 AM IST

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్​ల నష్టపోయాయి. ఆసియా మార్కెట్​లు సైతం నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

ఇండియా స్టాక్​ మార్కెట్​
ఇండియా స్టాక్​ మార్కెట్​ (REUTERS)

Stock market news today : దేశీయ స్టాక్​ మర్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్ 316​ పాయింట్ల నష్టంతో 61,004 వద్ద కొనసాగుతోంది. 101 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ.. 17,935 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలతో దేశీయ స్టాక్​ మార్కెట్​లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. గురువారం ట్రేడింగ్​ సెషన్​లో 20 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 18,035 వద్ద ముగిసింది. 44 పాయింట్ల లాభంతో 61,319 వద్ద స్థిరపడింది బీఎస్​ఈ సెన్సెక్స్​. ఇక బ్యాంక్​ నిఫ్టీ 99 పాయింట్లు కోల్పోయి 41,631 వద్దకు చేరింది. స్మాల్​ క్యాప్​, మిడ్ ​క్యాప్​ సూచీలు 1శాతం కన్నా ఎక్కువ పెరిగాయి. ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 61002- 17975 వద్ద మొదలుపెట్టాయి.

స్టాక్స్​ టు బై..

Stocks to buy : దివీస్​ ల్యాబొరేటరీస్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 2821, టార్గెట్​ రూ. 2950

కోల్​ ఇండియా లిమిటెడ్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్, స్టాప్​ లాస్​ రూ. 211, టార్గెట్​ రూ. 220- రూ. 224

మ్యాక్స్​ ఫైనాన్షియల్​ సర్వీసెస్​ లిమిటెడ్​ (ఎంఎఫ్​ఎస్​ఎల్​):- బై రూ. 739, స్టాప్​ లాస్​ రూ. 723, టార్గెట్​ రూ. 769

సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా:- బై రూ. 27, స్టాప్​ లాస్​ రూ. 27.50, టార్గెట్​ రూ 29.50

లాభాలు.. నష్టాలు..

అల్ట్రాటెక్​ సిమెంట్​, నెస్లే, భారతీ ఎయిర్​టెల్​, ఐసీఐసీఐ బ్యాంక్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

టెక్​ఎం, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, టాటా మోటార్స్​, విప్రో, ఇన్ఫీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్​లు..

వడ్డీ రేట్ల పెంపు తీవ్రతపై ఫెడ్​ అధికారులు చేసిన నెగిటివ్​ వ్యాఖ్యలతో అమెరికా స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​లో భారీగా నష్టపోయాయి. డో జోన్స్​ 1.26శాతం, ఎస్​ అండ్​ పీ 500 1.38శాతం, నాస్​డాక్​ 1.78శాతం పడ్డాయి.

US Stock market investment in Telugu : అమెరిక మార్కెట్​ల ప్రతికూల పవనాల కారణంగా ఆసియా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200.. 0.5శాతం, సౌత్​కొరియా కాస్పి 0.53శాతం, జపాన్​ నిక్కీ 0.59శాతం నష్టపోయాయి.

చమురు ధరలు..

చమురు ధరలు నష్టపోయాయి. బ్రెంట్​ క్రూడ్​ 24 సెంట్లు పడి బ్యారెల్​కు 85.14 డాలర్లకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

India Stock market news : గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1570.62కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు కూడా రూ. 1577.27కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

WhatsApp channel