Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్లకు స్వల్ప లాభాలు..-stock market news today 15 november sensex nifty ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today 15 November Sensex Nifty

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్లకు స్వల్ప లాభాలు..

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 15, 2022 09:17 AM IST

Stock market news : దేశీయ స్టాక్​ మార్కెట్లు ఫ్లాట్​గా ఓపెన్​ అయ్యాయి. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

స్టాక్​ మార్కెట్​ ఇండియా
స్టాక్​ మార్కెట్​ ఇండియా (REUTERS)

Stock market news : దేశీయ స్టాక్​ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 124 పాయింట్ల లాభంతో వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. పాయింట్లు పెరిగి వద్ద ట్రేడ్​ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

బీఎస్​ఈ సెన్సెక్స్​.. 171పాయింట్ల నష్టంతో 61,624 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 21పాయింట్లు కోల్పోయి 18,329 వద్దకు చేరింది. బీఎస్​ఈ మిడ్​ క్యాప్​, స్మాల్​ క్యాప్​ సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 61630- 18363 వద్ద మొదలుపెట్టాయి.

పివొట్​ ఛార్ట్​ ప్రకారం.. నిఫ్టీ సపోర్ట్​ 18,313- 18,292 లెవెల్స్​ వద్ద ఉన్నాయి. నిప్టీ రెసిస్టెన్స్​ 18,380- 18,401 లెవల్స్​ వద్ద ఉంది.

స్టాక్స్​ టు బై..

  • Stocks to buy : జేకే పేపర్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 412, టార్గెట్​ రూ. 440
  • టెక్​ మహీంద్రా:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1046, టార్గెట్​ రూ. 1111
  • గ్రాసిమ్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1710, టార్గెట్​ రూ. 1820
  • ఇండస్​ఇండ్​ బ్యాంక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1125, టార్గెట్​ రూ. 1195
  • విప్రో:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 384, టార్గెట్​ రూ .410

పూర్తి లిస్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

లాభాలు.. నష్టాలు..

టైటాన్​, ఐసీఐసీఐ బ్యాంక్​, టాటా స్టీల్​, ఎన్​టీపీసీ, ఎం అండ్​ ఎం షేర్లు లాభాల్లో ఉన్నాయి. 

ఇన్ఫీ, పవర్​గ్రిడ్​, టెక్​ఎం, హెచ్​సీఎల్​ టెక్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు..

US Stock markets : అమెరికా స్టాక్​ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. డౌ జోన్స్​ 0.63శాతం, నాస్​డాక్​ 1.12శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.89శాతం పతనమయ్యాయి.

ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లో ఉన్నాయి. చైనా నుంచి ఎకామిక్​ డేటా వస్తుండటంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జపాన్​ నిక్కీ నష్టాల్లో ఉంది. సౌత్​ కొరియా కాస్పి 0.15శాతం పతనమైంది. ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 స్వల్ప నష్టాల్లో ట్రేడ్​ అవుతోంది.

చమురు ధరలు..

చమురు ధరలు దాదాపు 3 డాలర్లు పతనమై.. 93.14 డాలర్లకు చేరింది.

త్రైమాసిక ఫలితాలు..

రాజేష్​ ఎక్స్​పోర్ట్స్​, అడ్వానస్​ సింటెక్స్​, భండారి ఇన్​ఫ్రాకాన్​, హన్​మన్​ ఫిట్​, రిద్ధి స్టీల్​ అండ్​ ట్యూబ్​, షహ్లాన్​ సిల్క్​ ఇండస్ట్రీస్​తో పాటు ఇతర సంస్థల త్రైమాసిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి.

IRCTC q2 results పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1089.41కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు.. రూ. 47.18కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

WhatsApp channel