Stock market news today : లాభాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీ 50 పాయింట్లు జంప్​-stock market news today 14 feb 2023 sensex and nifty opens on a positive note ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today 14 Feb 2023 Sensex And Nifty Opens On A Positive Note

Stock market news today : లాభాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీ 50 పాయింట్లు జంప్​

Sharath Chitturi HT Telugu
Feb 14, 2023 09:17 AM IST

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ఉన్నాయి. అమెరికా స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్​లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఇండియా స్టాక్​ మార్కెట్​ న్యూస్​
ఇండియా స్టాక్​ మార్కెట్​ న్యూస్​ (PTI)

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 193 పాయింట్ల లాభంతో 60,624 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 51 పాయింట్లు పెరిగి 17,822 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

ఐటీ, బ్యాంక్​ సెక్టార్​ స్టాక్స్​లో అమ్మకాల ఒత్తిడి కారణంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 251 పాయింట్ల నష్టంతో 60,431కు చేరింది. 86 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ.. 17,771 వద్ద ముగిసింది. ఐటీ సెక్టార్​ దాదాపు 2శాతం పతనమైంది. బీఎస్​ఈ స్మాల్​క్యాప్​, మిడ్​క్యాప్​ సూచీలు 1.25శాతం మేర నష్టపోయాయి. ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 60550- 17840 వద్ద మొదలుపెట్టాయి.

స్టాక్స్​ టు బై..

ITC Share price target : ఐటీసీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 362, టార్గెట్​ రూ. 392

డాబర్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 500, టార్గెట్​ రూ. 580

Titan share price target : 'టైటాన్​ :- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 2470, టార్గెట్​ రూ. 2575- రూ. 2600

పూర్తి లిస్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

లాభాలు.. నష్టాలు..

ఇన్ఫీ, టాటా స్టీల్​, టీసీఎస్​, ఎస్​బీఐ, విప్రో షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఇండస్​ఇండ్​, సన్​ఫార్మా, కొటాక్​ బ్యాంక్​, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్​లు..

US Stock market investment tips in Telugu : యూఎస్​ సీపీఐ డేటా ఈరోజు వెలువడనుంది. ఈ నేపథ్యంలో.. అమెరికా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభపడ్డాయి. డౌ జోన్స్​ 1.1శాతం, ఎస్​ అండ్​ పీ 500 1.14శాతం, నాస్​డాక్​ 1.48శాతం మేర లాభాల్లో ముగిశాయి.

అమెరికా స్టాక్​ మార్కెట్​ల నుంచి అందిన సానుకూల పవనాలతో ఆసియా మార్కెట్​లు సైతం లాభాల్లోనే ఉన్నాయి. ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 0.52శాతం, జపాన్​ నిక్కీ 0.8శాతం, సౌత్​ కొరియా కాస్పి 1శాతం లాభాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

త్రైమాసిక ఫలితాలు..

Adani Enterprises Q3 results : అదానీ ఎంటర్​ప్రైజెస్​, ఐషేర్​ మోటార్స్​, గ్రాసిమ్​ ఇండస్ట్రీస్​, ఓఎన్​జీసీ, అపోలో హాస్పిటల్స్​, బాటా ఇండియా, భారత్​ ఫోర్జ్​, బయోకాన్​, బాష్​, ఎన్​ఎండీసీ, పీఐ ఇండస్ట్రీస్​, పీఎన్​సీ ఇన్​ఫ్రాటెక్​తో పాటు మరిన్ని సంస్థల త్రైమాసిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1322.39కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 521.69కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం