Stock market news today : స్టాక్​ మార్కెట్​లకు నష్టాలు.. నిఫ్టీ 17 పాయింట్లు డౌన్​-stock market news today 13 january 2023 sensex and nifty opens flat with mild losses ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today 13 January 2023, Sensex And Nifty Opens Flat With Mild Losses

Stock market news today : స్టాక్​ మార్కెట్​లకు నష్టాలు.. నిఫ్టీ 17 పాయింట్లు డౌన్​

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 13, 2023 09:17 AM IST

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ఉన్నాయి. అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి.

ఇండియా స్టాక్​ మార్కెట్​
ఇండియా స్టాక్​ మార్కెట్​ (MINT_PRINT)

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 103 పాయింట్ల నష్టంతో 59,854 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో 17,841 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

అంతర్జాతీయ మార్కెట్​లు లాభాల బాట పడుతున్నప్పటికీ.. దేశీయ సూచీలు మాత్రం వరుసగా మూడో రోజు (గురువారం) కూడా నష్టాలనే నమోదు చేశాయి. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 37 పాయింట్లు కోల్పోయి 17,858 వద్ద స్థిరపడింది. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 147 పాయింట్ల నష్టంతో 59,958 వద్ద ముగిసింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ.. 150 పాయింట్లు పతనమై 42,082కు చేరింది. ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 60046- 17868 వద్ద మొదలుపెట్టాయి.

పివోట్​ ఛార్ట్​ ప్రకారం.. నిఫ్టీ సపోర్ట్​ 17,785- 17,741- 17,671 వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్​ 17,925- 17,969, 18,039 వద్ద ఉంది.

స్టాక్స్​ టు బై..

  • Stocks to buy : జేకే సిమెంట్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 2850, టార్గెట్​ రూ. 2975- రూ. 3000
  • ఎంసీఎక్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1480, టార్గెట్​ రూ. 1550- రూ. 1575
  • IRCTC share price target : ఐఆర్​సీటీసీ:- బై రూ. 641, టార్గెట్​ రూ. 670, స్టాప్​ లాస్​ రూ. 625
  • లార్సెన్​ అండ్​ టుబ్రో (ఎల్​టీ):- బై రూ. 2161, స్టాప్​ లాస్​ రూ. 2120, టార్గెట్​ రూ. 2240

లాభాలు.. నష్టాలు..

టెక్​ఎం, విప్రో, ఇన్ఫీ, నెస్లే, టీసీఎస్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

హెచ్​సీఎల్​ టెక్​, రిలయన్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్​లు..

US Stock Market news : అమెరికా స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.64శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.34శాతం, నాస్​డాక్​ 0.64శాతం మేర లాభపడ్డాయి.

ఆసియా మార్కెట్​లు ఫ్లాట్​గా ఉన్నాయి. ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 0.76శాతం పెరిగింది. జపాన్​ నిక్కీ 0.3శాతం పడింది. సౌత్​ కొరియా కాస్పి 0.92శాతం వృద్ధి చెందింది.

త్రైమాసిక ఫలితాలు..

Wipro Q3 results : విప్రో, ఎల్​ అండ్​ టీ ఫైనాన్స్​ హోల్డింగ్స్​, ఆదిత్య బిర్లా మనీ, జస్ట్​ డయల్​, అనూప్​ ఇంజినీరింగ్​, ఛాయిస్​ ఇంటర్నేషనల్​, గణేశ్​ హౌజింగ్​ కార్పొరేషన్​ వంటి సంస్థల క్యూ3 ఫలితాలు నేడు వెలువడనున్నాయి.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, అవెన్యూ సూపర్​మార్కెట్స్​, ఇన్​ఫోమీడియా ప్రెస్​తో పాటు మరిన్ని సంస్థల క్యూ3 ఫలితాలు శనివారం వెలువడనున్నాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

ఇండియా స్టాక్​ మార్కెట్​లో.. గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1662.63కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2127.65కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం