Stock market news today : నష్టాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీకి 40 పాయింట్లు లాస్​-stock market news today 10 feb 2023 sensex and nifty opens on a negative note ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today 10 Feb 2023 Sensex And Nifty Opens On A Negative Note

Stock market news today : నష్టాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీకి 40 పాయింట్లు లాస్​

Sharath Chitturi HT Telugu
Feb 10, 2023 09:18 AM IST

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్​లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్​లు ఫ్లాట్​గా ఉన్నాయి.

ఇండియా స్టాక్​ మార్కెట్​
ఇండియా స్టాక్​ మార్కెట్​ (REUTERS)

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాల్లో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 70 పాయింట్ల నష్టంతో 60,736 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ50.. 43 పాయింట్లు కోల్పోయి 17,850 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ను స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 142 పాయింట్లు పెరిగి 60,806 వద్ద ముగిసింది. నిఫ్టీ50.. 21 పాయింట్ల లాభంతో 17,893 వద్ద స్థిరపడింది. ఇక 16 పాయింట్లు పెరిగిన బ్యాంక్​ నిఫ్టీ.. 41,554 వద్దకు చేరింది. అదానీ గ్రూప్​ స్టాక్స్​లో తీవ్ర ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి. ఇది స్టాక్​ మార్కెట్​లను ప్రభావితం చేస్తోంది. ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 60,707- 17,848 వద్ద మొదలుపెట్టాయి.

స్టాక్స్​ టు బై..

Asian paints share price target : ఏషియన్​ పెయింట్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 2760, టార్గెట్​ రూ. 2880- రూ. 2900

పీఎఫ్​సీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 141, టార్గెట్​ రూ. 150- రూ. 152

M&M share price target : ఎం అండ్​ ఎం:- బై రూ. 1373, స్టాప్​ లాస్​ రూ. 1340, టార్గెట్​ రూ. 1420

హెచ్​డీఎఫ్​సీ లైఫ్​:- బై రూ. 520, స్టాప్​ లాస్​ రూ. 505, టార్గెట్​ రూ. 545

లాభాలు.. నష్టాలు..

ఎం అండ్​ ఎం, ఏషియన్​ పెయింట్స్​, బజాజ్​ ఫిన్​సర్వ్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

హెచ్​సీఎల్​ టెక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, విప్రో, ఇన్ఫీ, ఎస్​బీఐ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్​లు..

US Stock market investment tips : అమెరికా స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టపోయాయి. డౌ జోన్స్​ 0.73శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.88శతం, నాస్​డాక్​ 1.02శాతం మేర పడ్డాయి.

చైనా ద్రవ్యోల్బణం డేటా నేపథ్యంలో ఆసియా మార్కెట్​లు మిశ్రమంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 0.6శాతం లాభాల్లో ఉంది. జపాన్​ నిక్కీ 0.1శాతం లాభాల్లో ఉంది. సౌత్​ కొరియా కాస్పి 0.76శాతం పడింది.

చమురు ధరలు..

చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్​ క్రూడ్​ 59 సెంట్లు పడి బ్యారెల్​కు 84.50 డాలర్లకు చేరింది.

త్రైమాసిక ఫలితాలు..

M&M Q3 results : మహీంద్రా అండ్​ మహీంద్రా, ఏబీబీ ఇండియా, పీబీ ఫిన్​టెక్​, అబాట్​ ఇండియా, ఆల్కెమ్​ లాబొరేటరీస్​, అశోక్​ బిల్డ్​కాన్​, ఆస్ట్రాజెనెకా ఫార్మా, బీఈఎంఎల్​, బీహెచ్​ఈఎల్​, దిలిప్​ బిల్డ్​కాన్​, డెలివరీ, ఈఐహెచ్​, గ్లెన్​మార్క్​ ఫార్మా, జేకీ లక్ష్మీ సిమెంట్​, ఇన్ఫో ఎడ్జ్​ ఇండియాతో పాటు మరిన్ని సంస్థ త్రైమాసిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

దేశీయ స్టాక్​ మార్కెట్​ గురువారం ట్రేడింగ్​ సెషన్​లో రూ. 144.73కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 205.25కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

WhatsApp channel