Stock Market : స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం.. కానీ ఈ చిన్న షేరులో మాత్రం పెరుగుదల!-stock market losses today but indo count industries share jumped over 10 percent know in details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market : స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం.. కానీ ఈ చిన్న షేరులో మాత్రం పెరుగుదల!

Stock Market : స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం.. కానీ ఈ చిన్న షేరులో మాత్రం పెరుగుదల!

Anand Sai HT Telugu Published Feb 12, 2025 01:03 PM IST
Anand Sai HT Telugu
Published Feb 12, 2025 01:03 PM IST

Stock Market : కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్ ఒడిదొడుకుల్లో ఉంది. పెద్ద పెద్ద కంపెనీల షేర్లు పడిపోతున్నాయి. అయితే స్మాల్‌క్యాప్ కంపెనీ ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ షేర్లలో మాత్రం పెరుగుదల కనిపించింది.

స్టాక్ మార్కెట్
స్టాక్ మార్కెట్

మార్కెట్ లో అల్లకల్లోలం నడుస్తున్నా, స్మాల్‌క్యాప్ కంపెనీ ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ షేర్లు ఊహించని విధంగా పెరిగాయి. బుధవారం ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ షేర్లు 10 శాతం కంటే ఎక్కువ పెరిగి రూ.299కి చేరుకున్నాయి. డిసెంబర్ 2024 త్రైమాసికంలో మంచి ఫలితాల తర్వాత ఈ పెరుగుదల కనిపించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ లాభం గత సంవత్సరం కంటే 30 శాతం పెరిగి రూ.75 కోట్లుగా ఉంది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.58 కోట్ల లాభం వచ్చింది. గత 15 సంవత్సరాలలో ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ షేర్లు 15000 శాతం కంటే ఎక్కువ పెరిగాయి.

15 ఏళ్లలో

ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ షేర్లు గత 15 సంవత్సరాలలో 15000 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. 19 ఫిబ్రవరి 2010 న ఈ కంపెనీ షేర్లు రూ.1.91 వద్ద ఉన్నాయి. 12 ఫిబ్రవరి 2025 న ఈ షేర్లు రూ.299కి చేరుకున్నాయి. గత 5 సంవత్సరాలలో ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ షేర్లు 425 శాతం పెరిగాయి. 14 ఫిబ్రవరి 2020 న ఈ షేర్లు రూ.57.55 వద్ద ఉన్నాయి. 12 ఫిబ్రవరి 2025న రూ.299కి చేరుకున్నాయి. ఈ షేర్ల 52 వారాల గరిష్ట స్థాయి రూ.450.45, కనిష్ట స్థాయి రూ.262.60.

స్టాక్ మార్కెట్

మరోవైపు ఈరోజు కూడా స్టాక్ మార్కెట్‌లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ.. బీఎస్ఈ సెన్సెక్స్ 527 పాయింట్లు పతనమై 75,788 వద్ద ట్రేడ్ అవుతుంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచి ఎన్ఎస్ఈ నిఫ్టీ 145 పాయింట్లు క్షీణించి 22,925 వద్ద ఉంది. ఒకానొద దశలో సెన్సెక్స్ 700 పాయింట్లకుపైగా తగ్గింది. మదుపర్లు కొన్ని నిమిషాల్లోనే లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. అమెరికా టారిఫ్స్, కంపెనీల క్యూ3 ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో ఇన్వెస్టర్లకు దెబ్బపడుతుంది.

గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. కేవలం స్టాక్ పనితీరు గురించి మాత్రమే. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్‌తో కూడుకున్నది. నిపుణుల సలహా తీసుకోండి.

Anand Sai

eMail
Whats_app_banner