Defence Stocks : భారత్‌లో టాప్ డిఫెన్స్ స్టాక్స్.. ఇన్వెస్టర్లకు మంచి లాభాలు!
Defence Stocks : స్టాక్ మార్కెట్‌లో కొన్ని డిఫెన్స్ స్టాక్స్ మంచి పనితీరును కనబరుస్తున్నాయి. ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ లాభాలను తెచ్చుపెడుతున్నాయి. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇండియాలో టాప్ డిఫెన్స్ స్టాక్ గురించి చూద్దాం..
ఒక దేశం మనుగడకు అవసరమైన వాటిలో రక్షణ దళాలు చాలా ముఖ్యమైనవి. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా, మన దేశం స్వయం సమృద్ధి ద్వారా పెద్ద ప్రాజెక్టులను ప్లాన్ చేసి అమలు చేస్తోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద సైన్యం అయిన భారతదేశం తన సరిహద్దులను, పౌరులను రక్షించడానికి బలమైన రక్షణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేశంలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు.. రక్షణ పరికరాల తయారీ, సరఫరాలో పాల్గొంటున్నాయి. మన దేశం తన 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొంటున్న సందర్భంగా టాప్ డిఫెన్స్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం..
హిందుస్థాన్ ఏరోనాటిక్స్
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లేదా HAL అనేది విమానయాన రంగంలో పనిచేస్తున్న ప్రఖ్యాత ప్రభుత్వ రంగ సంస్థ. షేరు ధర రూ.4,661.35. గత ఆరు నెలల్లో ఈ స్టాక్ 57.62 శాతం పెరిగింది. ఒక్క ఏడాదిలో 140 శాతం పురోగతి. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2 లక్షల కోట్లకు పైగా ఉంది.
సికా ఇంటర్‌ప్లాంట్
సికా ఇంటర్‌ప్లాంట్ సిస్టమ్స్ లిమిటెడ్ అనేది ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ స్పేస్, ఆటోమోటివ్ రంగాలలో ఉత్పత్తులు, ఇతర సేవలను అందించే సంస్థ. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ధర రూ.2,740. గత ఆరు నెలల్లో ఈ షేరు 81.77 శాతం లాభపడగలిగింది. 2024లో ఇప్పటివరకు ఈ స్టాక్ 91.21 శాతం లాభపడింది. ఈ డిఫెన్స్ స్టాక్ కూడా ఒక సంవత్సరంలో పెట్టుబడిదారులకు 195.32 శాతం రాబడిని అందించగలిగింది.
భారత్ డైనమిక్స్
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కంపెనీ గైడెడ్ క్షిపణులు, గనులు, నీటి అడుగున ఆయుధాలు, వివిధ రైఫిల్స్, మిలిటరీకి సంబంధించిన భాగాలను తయారు చేస్తుంది. ప్రస్తుత షేరు ధర రూ.1,322. ఆరు నెలల్లో ఈ స్టాక్ 62 శాతం వృద్ధిని సాధించింది. ఒక సంవత్సరం పురోగతి 135.32 శాతం.
తనేజా ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్
తనేజా ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ లిమిటెడ్.. ఎయిర్‌ఫీల్డ్, MRO సంబంధిత సేవల సంస్థ. ప్రస్తుత షేరు ధర రూ.574. 2024లో ఇప్పటివరకు ఈ స్టాక్ 63.30 శాతం వృద్ధిని సాధించింది. గత ఏడాది పురోగతి 136.75 శాతం.
పారాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్
పారాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ 40 సంవత్సరాల చరిత్ర కలిగిన రక్షణ పరికరాలు, స్పేస్ టెక్నాలజీ సంస్థ. ప్రస్తుత షేరు ధర రూ.1,153.90. ఆరు నెలల్లో 60 శాతం, ఒక సంవత్సరంలో 82 శాతం లాభపడింది.
ఈ డిఫెన్స్ స్టాక్స్ కూడా
డేటా ప్యాటర్న్స్(ఇండియా) లిమిటెడ్, హై ఎనర్జీ బ్యాటరీస్ (ఇండియా) లిమిటెడ్, ఐడియాఫోర్జ్ టెక్నాలజీ లిమిటెడ్ కూడా ఇన్వెస్టర్లకు మంచి రాబడిని అందించిన డిఫెన్సివ్ స్టాక్‌లుగా ఉన్నాయి.
గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. కేవలం స్టాక్ పనితీరు గురించి మాత్రమే. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్నది.