Stock Market Holidays 2025 : జనవరి 1న స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా? 2025లో హాలిడేస్ ఎన్ని?
Stock Market Holidays 2025 : కొంతమంది కొత్త ఏడాదిలో స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ మెుదలుపెట్టాలి అనుకుంటారు. మరికొందరేమో జనవరి 1న తెలివిగా ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటారు. ఇంతకీ 2025 జనవరి 1న స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా?
2025 కొత్త సంవత్సరంలోకి ప్రవేశించడానికి రెడీగా ఉన్నాం. కొత్త సంవత్సరాన్ని వెల్‌కమ్ చేసేందుకు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే చాలా మంది జనవరి 1న స్టాక్ మార్కెట్ వైపు కూడా చూస్తారు. ట్రేడింగ్ చేసేవారికి స్టాక్ మార్కెట్ కూడా ముఖ్యం. కానీ మార్కెట్ ఆరోజున ఓపెన్ ఉంటాయా అని చాలా మందికి అనుమానం. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE) వంటి భారతీయ స్టాక్ మార్కెట్ ఎక్స్ఛేంజీలు జనవరి 1న ఉంటాయా?
ప్రతి క్యాలెండర్ సంవత్సరం ప్రారంభానికి ముందు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బీఎస్ఈ హాలిడేస్ లిస్ట్ విడుదల చేస్తాయి. 2025లో ఎన్ఎస్ఈ, బీఎస్ఈ 14 సెలవులను ప్రకటించాయి. ఆ జాబితాలో జనవరి 1(బుధవారం) లేదు. అంటే జనవరి 1న స్టాక్ మార్కెట్ తెరుచుకుంటుంది. బీఎస్ఈ వెబ్‌సైట్ ప్రకారం, జనవరి 1, 2025న ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్, సెక్యూరిటీస్ లెండింగ్, బారోయింగ్ (SLB) విభాగాల్లో ట్రేడింగ్ సాధారణంగా ఉంటుంది. ఈక్విటీ మార్కెట్ ఉదయం 9:15 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3:30 గంటలకు ముగుస్తుంది. జనవరి 2025లో స్టాక్ మార్కెట్ 8 రోజులు (4 శనివారాలు, 4 ఆదివారాలు) మూసివేస్తారు. సాధారణంగా శని, ఆదివారాలు స్టాక్ మార్కెట్ క్లోజ్ ఉంటుంది. 2025లో మిగతా ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో చూద్దాం..
స్టాక్ మార్కెట్ హాలిడే లిస్ట్ 2025
2025 ఫిబ్రవరి 26 : బుధవారం, మహాశివరాత్రి
మార్చి 14: శుక్రవారం, హోలీ
మార్చి 31: సోమవారం, ఈద్-ఉల్-ఫితర్
ఏప్రిల్ 10: గురువారం, మహావీర జయంతి
ఏప్రిల్ 14: సోమవారం, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 18: శుక్రవారం, గుడ్ ఫ్రైడే
మే 1 : గురువారం, మహారాష్ట్ర దినోత్సవం
ఆగస్టు 15: శుక్రవారం, స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్టు 27: బుధవారం, గణేష్ చతుర్థి
అక్టోబర్ 2: గురువారం, మహాత్మా గాంధీ జయంతి / దసరా
అక్టోబర్ 21: మంగళవారం, దీపావళి
అక్టోబర్22 : బుధవారం, దీపావళి బలిప్రతిపాద
నవంబర్ 5 : బుధవారం, ప్రకాష్ గురుపురబ్ శ్రీ గురునానక్ దేవ్
డిసెంబర్ 25 : గురువారం, క్రిస్మస్
స్టాక్ మార్కెట్ బడ్జెట్ రోజు శనివారం ఫిబ్రవరి 1న తెరిచే ఉంటుంది. బడ్జెట్ రోజున మార్కెట్లు యథావిధిగా పనిచేస్తాయని ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ ప్రకటించాయి. న్యూ ఇయర్ రోజున చాలా గ్లోబల్ మార్కెట్లు మూసిఉండవు. అలాగే జనవరి 1న భారతీయ స్టాక్ మార్కెట్లు యథావిధిగా పనిచేయనున్నాయి.