Stock market holiday : స్టాక్ మార్కెట్లకు నేడు సెలవు.. కారణం ఇదే
Stock market holiday : స్టాక్ మార్కెట్లకు నేడు సెలవు. గురునానక్ జయంతి సందర్బంగా సెలవు తీసుకున్నాయి బీఎస్ఈ, ఎన్ఎస్ఈ.
Stock market holiday today : గురునానక్ జయంతి సందర్భంగా.. నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు. మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎలాంటి ట్రేడింగ్ యాక్టివిటీ ఉండదు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ అధికారిక ప్రకటన ప్రకారం.. మంగళవారం, నవంబర్ 8న మార్కెట్ సెషన్ మొత్తం మూతపడే ఉంటుంది.
ట్రెండింగ్ వార్తలు
ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్, ఎస్ఎల్బీ సెగ్మెంట్లలో మంగళవారం ఎలాంటి ట్రేడింగ్ యాక్టివిటీలు ఉండవు. అదే సమయంలో కరెన్సీ డెరివేటివ్ సెగ్మెంట్, ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్ సెగ్మెంట్లో ట్రేడింగ్‌ను సస్పెండ్ చేశారు.
కమోడిటీ సెగ్మెంట్లో ఎంసీఎక్స్(మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్)ని తొలి సగం మూసివేశారు. ఈవినింగ్ సెషన్.. అంటే మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఇందులో ట్రేడింగ్ చేసుకోవచ్చు.
పేటీఎం క్యూ2 ఫలితాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Stocks Market today : దేశీయ స్టాక్ మార్కెట్లకు ఈ ఏడాది ఇదే చివరి సెలవు దినం. మొత్తం మీద ఈ ఏడాదిలో స్టాక్ మార్కెట్లకు 16 రోజుల పాటు సెలవులు లభించాయి. ఇక బుధవారం.. స్టాక్ మార్కెట్లు సాధారణ సమయానికే తిరిగి తెరుచుకోనున్నాయి.
అక్టోబర్ నెలలో దసరా, దీపావళి, దివాళీ బలిప్రాతిపద నేపథ్యంలో స్టాక్ మార్కెట్లకు మూడు రోజుల పాటు సెలవులు లభించాయి.
మార్కెట్లకు లాభాలు..
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ను దేశీయ సూచీలు లాభాల్లో ముగించాయి. 230 పాయింట్లు పెరిగి సెన్సెక్స్.. 61000 మార్క్‌ను తిరిగి దక్కించుకుంది. నిఫ్టీ50.. 04.శాతం వృద్ధిచెంది 18,202 వద్ద ముగిసింది. మెటల్, బ్యాంక్, ఆటో స్టాక్స్‌లో కొనుగోళ్ల జోరు స్పష్టంగా కనిపిస్తోంది. డాలరుపై రూపాయి బలపడటం కూడా మదుపర్ల సెంటిమెంట్‌కు కలిసివచ్చింది.
సెన్సెక్స్ 30లో 18 స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ 0.64శాతం, మిడ్ క్యాప్ 0.69శాతం మేర లాభపడ్డాయి.
కోల్ ఇండియా క్యూ2 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
Stock market live : సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐ.. రూ. 1948.51కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు.. రూ. 844.2కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఎఫ్ఐఐల పెట్టుబడుల ప్రవాహంతో గత కొన్ని రోజులుగా సూచీలు పెరుగుతున్నాయి. నిఫ్టీ50 ఆల్ టైమ్ హైకి దగ్గర్లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ.. ఆల్‌టైమ్ హైని దాటేసింది. క్యూ2 త్రైమాసిక ఫలితాల్లో అనేక కంపెనీలు అంచనాలకు మించి రాణించడం కూడా కలిసి వస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లు..
అమెరికా, యూకే మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. వాటి నుంచి వచ్చిన సానుకూల పవనాలతో ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లోనే ఉన్నాయి. జపాన్ నిక్కీ, సౌత్ కొరియా కాస్పి సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
అయితే.. మరో రెండు రోజుల్లో యూఎస్ సీపీఐ డేటా వెలువడనుంది. ఫెడ్ వడ్డీ రేట్ల చర్యలు.. ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తున్నాయా? లేదా? అన్నది ఈ డేటాతో స్పష్టమవుతుంది. ఈ డేటా విషయంలో మదుపర్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
సంబంధిత కథనం