Stock market holiday : నేడు దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు..
Is Stock market holiday today : జూన్ 2024 లో ఒకే ఒక స్టాక్ మార్కెట్ సెలవు ఉంది. అది ఈరోజే. నేడు దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు. ఆ వివరాలు..
Stock market holiday on 17 june 2024 : ఈద్ ఉల్-అధా 2024 కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్ ఎక్స్ఛేంజీలు బీఎస్ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) నేడు, సోమవారం మూతపడి ఉంటాయి. బక్రీద్ సందర్భంగా ఈక్విటీ, డెరివేటివ్స్, ఎస్ఎల్బీ సహా అన్ని విభాగాలు పనిచేయవు. స్టాక్ మార్కెట్ హాలిడే క్యాలెండర్ 2024 జూన్ 17 సోమవారం బక్రీద్‌కు ట్రేడింగ్ సెలవు దినంగా చూపిస్తుంది.
శుక్రవారం అనంతరం భారత స్టాక్ మార్కెట్లో ఈక్విటీ ట్రేడింగ్.. జూన్ 18, మంగళవారం తిరిగి ప్రారంభమవుతుంది.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎంసీఎక్స్)లో కమోడిటీస్ ట్రేడింగ్ ఈ రోజు ఉదయం సెషన్లో మూతపడి ఉంటుంది. కానీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11.55 గంటల వరకు సెషన్ నిర్వహిస్తారు.
Stock market holiday today : జూన్ 2024 లో ఒకే ఒక స్టాక్ మార్కెట్ సెలవు ఈ బక్రీద్. తదుపరి ట్రేడింగ్ సెలవు ఇప్పుడు మొహర్రం కోసం జూలై 17 న ఉంటుందని స్టాక్ మార్కెట్ హాలిడే లిస్ట్ చూపిస్తోంది. 2024 క్యాలెండర్ ఇయర్లో మొత్తం 15 సెలవులు ఉన్నాయి.ఈ ఏడాది మిగిలిన ట్రేడింగ్ సెలవులు..
జూలై 17- మొహర్రం,
ఆగస్టు 15- స్వాతంత్ర్య దినోత్సవం,
అక్టోబర్ 2- మహాత్మా గాంధీ జయంతి,
నవంబర్ 1- దీపావళి,
నవంబర్ 15- గురునానక్ జయంతి,
డిసెంబర్ 25- క్రిస్మస్.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఇలా..
Stock market latest news today : మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50లో.. జూన్ 14, శుక్రవారం ఆటో, కన్జ్యూమర్ డ్యూరెబుల్, ఫైనాన్షియల్ స్టాక్స్ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 181.87 పాయింట్లు లేదా 0.24% పెరిగి 76,992.77 వద్ద, నిఫ్టీ 66.70 పాయింట్లు లేదా 0.29% పెరిగి 23,465.60 వద్ద స్థిరపడ్డాయి. బెంచ్‌మార్క్ నిఫ్టీ 50 ఈ సెషన్లో 23,490.40 వద్ద రికార్డు గరిష్టాన్ని తాకింది.
నిఫ్టీ మిడ్ క్యాప్ 100 1.05 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.8 శాతం లాభపడటంతో విస్తృత మార్కెట్లు ర్యాలీకి మద్దతు పలికాయి.
నిఫ్టీ 50 గత వారం మొత్తం స్వల్ప శ్రేణిలో కన్సాలిడేట్ అయింది. ఎన్నికల ఫలితాల తరువాత అస్థిరత చాలా వరకు తగ్గింది. నిఫ్టీ 23,500 దిగువన వారాంతపు లాభాలతో ముగిసింది.
Stock market holiday list : "ఇటీవలి ఎన్నికల వారం అస్థిరత తర్వాత కనిపించిన కొత్త మైలురాళ్లతో మన మార్కెట్లు లాభాల్లో పయనిస్తూనే ఉన్నాయి. ఈ అప్ ట్రెండ్‌లో, ఎఫ్ఐఐలు తమ షార్ట్స్‌ని చాలావరకు కవర్ చేశారు. కొత్త లాంగ్లను యాడ్ చేసుకున్నారు. ఇది మొదట్లో స్టాక్ మార్కెట్ పరుగుకు దారితీసింది. మరోవైపు, రాజకీయ స్థిరత్వానికి సంబంధించి మార్కెట్ భాగస్వాములలో విశ్వాసం తిరిగి ప్రారంభమైంది, అందువల్ల, స్టాక్-నిర్దిష్ట సానుకూల వేగం చాలా కనిపించింది," అని 5పైసా.కామ్ లీడ్ రీసెర్చ్ రుచిత్ జైన్ అన్నారు.
రాబోయే వారంలో నిఫ్టీ 50 రెసిస్టెన్స్ 23,500 వద్ద కనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు, ఇది గత వారంలో రెసిస్టెన్స్‌గా ఉంది.
"దీనిని అధిగమించిన తర్వాత, నిఫ్టీ 23,900 - 24,000 వైపు వెళ్లొచ్చు. ఇది ఇటీవలి కరెక్షన్ రీట్రాక్షన్ జోన్. దిగువన 23,300, 23,000 - 23,900 జోన్లు మద్దతు ఇస్తున్నాయి. సపోర్ట్ దగ్గర బైయింగ్ అవకాశంగా చూడాలి," అని జైన్ అన్నారు.
స్టాక్ నిర్దిష్ట అవకాశాలను వెతుక్కోవాలని, సానుకూల దృక్పథంతో ట్రేడింగ్ చేయాలని ఆయన ట్రేడర్లకు సూచించారు.
డిస్క్లైమర్: పైన చేసిన అభిప్రాయాలు మరియు సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకింగ్ కంపెనీలవి, హెచ్‌టీ తెలుగువి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులతో సంప్రదించాలి.
సంబంధిత కథనం