Stock market holiday today : నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. ఈ నెలలో మరో రెండు హాలీడేలు!
Is stock market open today : మహా శివరాత్రి నేపథ్యంలో నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు. లాంగ్ వీకెండ్ తర్వాత.. దేశీయ సూచీలు మళ్లీ సోమవారం ఓపెన్ అవుతాయి.
Is stock market open on 8th march 2024 : 2024 మార్చ్ 8న, అంటే శుక్రవారం.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. 2024 స్టాక్ మార్కెట్ సెలవుల జాబితా ప్రకారం.. నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు. దేశం మొత్తం మహాశివరాత్రి పండుగను జరుపుకుంటున్న నేపథ్యంలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు.. 2024 మార్చ్ 8న మూతపడి ఉంటాయి.

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు కారణంగా.. ఉదయం సెషన్లలో కమోడిటీ మార్కెట్ మూతపడి ఉంటుంది. కానీ సాయంత్రం సెషన్లో.. అంటే సాయంత్రం 5:00 గంటలకు ట్రేడింగ్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభమవుతాయి.
Stock market holiday today : అదే సమయంలో.. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ సెగ్మెంట్లలో శుక్రవారం ఎలాంటి కార్యకలాపాలు ఉండవు. శుక్రవారం.. భారత స్టాక్ మార్కెట్లలో కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్ల ట్రేడింగ్ కూడా నిలిచిపోనుంది. పైన చెప్పినట్లుగా, కమోడిటీ మార్కెట్ సాయంత్రం 5:00 గంటల నుంచి రాత్రి 11:55 గంటల వరకు తెరిచి ఉంటుంది.
ఇక మూడు రోజుల లాంగ్ వీకెండ్ సెలవుల అనంతరం.. దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం తిరిగిన ఓపెన్ అవుతాయి.
స్టాక్ మార్కెట్ సెలవుల జాబితా..
Maha shivatratri stock market : 2024 మార్చ్‌లో వచ్చే మూడు స్టాక్ మార్కెట్ సెలవుల్లో.. మహాశివరాత్రి ఒకటి. మహాశివరాత్రి తరువాత, 2024లో స్టాక్ మార్కెట్ సెలవుల పూర్తి జాబితా ప్రకారం.. హోలీ, గుడ్ ఫ్రైడే కోసం వరుసగా మార్చ్ 25, 2024- మార్చి 29, 2024 న భారతీయ స్టాక్ మార్కెట్లు మూతపడి ఉంటాయి. కాబట్టి, మహాశివరాత్రి 2024 తరువాత, తదుపరి స్టాక్ మార్కెట్ సెలవు హోలీ పండుగ కోసం 2024 మార్చి 25న వస్తుంది.
2024లో మొదటి స్టాక్ మార్కెట్ సెలవు.. రిపబ్లిక్ డే (జనవరి 26). 2024 ఫిబ్రవరిలో అసలు హాలిడేనే లేదు. అయితే, 2024 జనవరిలో రెండు స్టాక్ మార్కెట్ సెలవులు ఉన్నాయి. అయోధ్య రామ మందిరంలో 'ప్రాణ ప్రతిష్ఠ' నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం 2024 జనవరి 22న ప్రభుత్వ సెలవును ప్రకటించింది. భారత స్టాక్ మార్కెట్ 2024 జనవరి 20న పనిచేశాయి. ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషషన్ని వాయిదా వేయడం ద్వారా బీఎస్ఈ, ఎన్ఎస్ఈ 2024 జనవరి 20 న పూర్తి ట్రేడింగ్ సెషన్‌ని నిర్వహించాయి. ఆ తర్వాత 2024 మార్చి 2న స్పెషల్ లైవ్ ట్రేడింగ్ సెషన్ జరిగింది.
Stock market news today : మార్చ్ 2024 తర్వాత 2024 ఏప్రిల్‌లో రెండు స్టాక్ మార్కెట్ సెలవులు నెల 11, 17 తేదీల్లో వస్తాయి. అవి ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్ ఈద్), శ్రీరామనవమి.
గురువారం ట్రేడింగ్ సెషన్లో..
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 33 పాయింట్ల లాభంతో 74,119 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 20 పాయింట్లు పెరిగి 22,494 వద్ద స్థిరపడింది.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 7,304.11 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2601.81 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
సంబంధిత కథనం