Stock market holiday today : నేడు స్టాక్​ మార్కెట్​లకు సెలవు- కారణం ఏంటంటే..-stock market holiday today 20th may 2024 lok sabha elections in mumbai ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market Holiday Today : నేడు స్టాక్​ మార్కెట్​లకు సెలవు- కారణం ఏంటంటే..

Stock market holiday today : నేడు స్టాక్​ మార్కెట్​లకు సెలవు- కారణం ఏంటంటే..

Sharath Chitturi HT Telugu
May 20, 2024 07:00 AM IST

Stock market holidays 2024 : దేశీయ స్టాక్​ మార్కెట్​లకు నేడు సెలవు. బీఎస్​ఈ సెన్సెక్స్​, ఎన్​ఎస్​ఈ నిఫ్టీలు పనిచేయవు. ఇందుకు గల కారణాన్ని ఇక్కడ తెలుసుకోండి..

నేడు స్టాక్​ మార్కెట్​లకు సెలవు..
నేడు స్టాక్​ మార్కెట్​లకు సెలవు.. (MINT_PRINT)

Stock market holiday today May 20 : బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) మే 20న మూతపడి ఉంటాయి. 2024 లోక్​సభ ఎన్నికల 5వ దశ పోలింగ్​లో భాగంగా ముంబైలో నేడు ఓటింగ్​ జరుగుతుండటం ఇందుకు కారణం. అందుకే.. సెన్సెక్స్​, నిఫ్టీలు సోమవారం పనిచేయవు.

స్టాక్​ మార్కెట్​లకు.. ఈ నెలలో ఇది రెండొవ హాలీడే. 1960 మే 1న మహారాష్ట్ర స్థాపనకు గుర్తుగా మహారాష్ట్ర దినోత్సవం కారణంగా ఈ నెల 1న స్టాక్​ మార్కెట్​లకు సెలవు లభించింది.

మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికలు ఐదు దశల్లో జరుగుతాయి. మొదటి నాలుగు వరుసగా ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13 తేదీల్లో జరిగాయి. చివరి దశ మే 20న జరగనుంది. ఇందులో భాగంగా సోమవారం ముంబైలో పోలింగ్​ జరగనుంది. ధూలే, దిండోరి, నాసిక్, కల్యాణ్, పాల్ఘర్, భివాండి, థానే, ముంబై నార్త్, ముంబై నార్త్ వెస్ట్, ముంబై నార్త్-ఈస్ట్, ముంబై నార్త్-సెంట్రల్, ముంబై సౌత్-సెంట్రల్, ముంబై సౌత్-సెంట్రల్, ముంబై సౌత్ సహా రాష్ట్రంలోని 48 లోకసభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.

Stock market holiday reason : ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న జరగనుంది.

ఐదో దశ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 20న మహారాష్ట్రలో.. స్టాక్​ మార్కెట్​తో పాటు బ్యాంకులు సైతం మూతపడనున్నాయి.

స్టాక్​ మార్కెట్​ సెలవులు- మే నుంచి..

మే 20 - సార్వత్రిక ఎన్నికలు

జూన్ 17 - బక్రీద్

జూలై 17 - మొహర్రం

ఆగస్టు 15 - స్వాతంత్ర్య దినోత్సవం

అక్టోబర్ 2 - గాంధీ జయంతి

నవంబర్ 1 - దీపావళి

నవంబర్ 15 - గురునానక్ జయంతి

డిసెంబర్ 25 - క్రిస్మస్

స్టాక్ మార్కెట్ అప్​డేట్స్​..

Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్​లు శనివారం ట్రేడింగ్ సెషన్​ను లాభాల్లో ముగించాయి. తాజా విదేశీ పెట్టుబడులు, సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో సెన్సెక్స్​, నిఫ్టీల్లో ఇటీవల మూడు రోజుల ర్యాలీ కొనసాగింది. స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్​లు కూడా పాజిటివ్​గానే ఉన్నాయి. ఓవరాల్​ సెక్టోరల్​ ఇండెక్స్​ కూడా మెరుగ్గా ఉన్నాయి.

సాధారణంగా.. శనివారం స్టాక్​ మార్కెట్​లు పనిచేయవు. కానీ డిజాస్ట్రర్​ మేనేజ్​మెంట్​ సిస్టెమ్​ని టెస్ట్​ చేసేందుకు మే 18న ట్రేడింగ్​ సెషన్​ జరిగింది. ఇది రెండో ప్రత్యేక సెషన్​. శనివారం.. బీఎస్​ఈ సెన్సెక్స్ 88.91 పాయింట్లు లేదా 0.12% పెరిగి 74,005.94 వద్ద ముగిసింది. నిఫ్టీ 35.90 పాయింట్లు లేదా 0.16 శాతం పెరిగి 22,502.00 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.51 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.82 శాతం లాభపడ్డాయి. ఫియర్ గేజ్ ఇండెక్స్ ఇండియా వీఐఎక్స్.. 3.67 శాతం వృద్ధిని నమోదు చేసింది.

అప్పటివరకు ఒడుదొడుకులు..!

2024 Lok Sabha elections : కాగా.. దేశీయ స్టాక్​ మార్కెట్​లో గత కొన్ని రోజులుగా ఒడుగొడుకులు కనిపిస్తున్నాయి. లోక్​సభ ఎన్నికల ఫలితాలు సమీపిస్తుండటం ఇందుకు కారణం. ఎన్నికల తర్వాత స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు జరిగితే.. మార్కెట్​లు కోలుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం