Stock Market Holiday : నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. ఎందుకంటే!
Stock Market Holiday : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం మూతపడి ఉంటాయి. ఈక్వీటీ డెరివేటివ్తో పాటు అనేక సెగ్మెంట్స్ పనిచేయవు. ఎందుకంటే..
Stock Market Holiday : ఉత్తర భారతంలో వినాయక చవితి మొదటి రోజు నేపథ్యంలో మంగళవారం స్టాక్ మార్కెట్లకు సెలవు ఉండనుంది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు మూతపడి ఉంటాయి. తిరిగి బుధవారం ఓపెన్ అవుతాయి.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో.. ఈక్విటీతో పాటు ఈక్విటీ డెరివేటివ్, కరెన్సీ డెరివేటివ్స్, ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్, ఎస్ఎల్బీ (సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్) వంటి సెగ్మెంట్స్ సైతం మూతపడి ఉంటాయి.
Stock market news today : ఇక మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో.. మార్నింగ్ సెషన్ ఉండదు. మార్నింగ్ సెషన్ అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. కానీ మంగళవారం నాడు.. సాయంత్రం సెషన్ (సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11:30/ 11:55 వరకు) యథాతథంగా కొనసాగుతుంది.
దక్షిణ భారతంలోని అనేక ప్రాంతాల్లో వినాయక చవితిని చాలా మంది సోమవారమే జరుపుకున్నారు. అయితే ఉత్తర భారతం, ముఖ్యంగా దలాల్ స్ట్రీట్ ఉండే ముంబై (మహారాష్ట్ర)లో గణేశ్ చతుర్థిని మంగళవారం జరుపుకుంటున్నారు. పైగా.. వినాయక చవితి అంటే.. అక్కడ చాలా పెద్ద పండుగ. అందుకే.. మంగళవారం స్టాక్ మార్కెట్లకు హాలీడే ఉండనుంది.
Stock market holidays list : మంగళవారం తర్వాత.. మహాత్మా గాంధీ జయంతి (అక్టోబర్ 2), దసరా (అక్టోబర్ 24), దీపావలి బలిప్రాతిపద (నవంబర్ 14), గురునానక్ జయంతి (నవంబర్ 27), క్రిస్మస్ (డిసెంబర్ 25) తేదీల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లు మూతపడి ఉంటాయి.
సోమవారం సెషన్లో ఇలా..
ఇక సోమవారం విషయానికొస్తే.. దేశీయ సూచీలు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 242 పాయింట్లు కోల్పోయి 67,597 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 59 పాయింట్ల నష్టంతో 20,133 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ.. 252 పాయింట్లు కోల్పోయి 45,980 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1236.51 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 552.55 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
సంబంధిత కథనం