Stock market holiday : నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు- అసలు కారణం ఇదే..
Stock market holidays : గురునానక్ జయంతి 2024 కారణంగా శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ కార్యకలాపాలు జరగవు. పూర్తి వివరాల్లోకి వెళితే..
గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 15, శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో ట్రేడింగ్ కార్యకలాపాలు నేడు మూతపడి ఉంటాయి. అందువల్ల, ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బి సెగ్మెంట్లో ఈ రోజు ఎటువంటి కార్యకలాపాలు ఉండవు. ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లో కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్ల ట్రేడింగ్ కూడా నిలిచిపోనుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లోని కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (ఈజీఆర్) సెగ్మెంట్లో ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు సాగే ట్రేడింగ్ కార్యకలాపాలను నిలిపివేసి సాయంత్రం 5:00 గంటలకు తిరిగి ప్రారంభిస్తారు. అంటే శుక్రవారం ఎంసీఎక్స్ (మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్), ఎన్సీడీఈఎక్స్ (నేషనల్ కమోడిటీ ఎక్స్ఛేంజ్)లలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎలాంటి చర్యలు ఉండవు.
2024లో స్టాక్ మార్కెట్ సెలవులు..
2024 లో స్టాక్ మార్కెట్ సెలవుల జాబితా ప్రకారం.. భారత స్టాక్ మార్కెట్ నవంబర్లకు మూడు పనిదినాల్లో సెలవు లభించింది. అవి.. దీపావళికి 1 నవంబర్ 2024, గురు నానక్ జయంతికి 15 నవంబర్ 2024, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 20 నవంబర్ 2024! ఇక డిసెంబర్లో, ఒక స్టాక్ మార్కెట్ సెలవు ఉంది. అది డిసెంబర్ 25న వచ్చే క్రిస్మస్.
అందువల్ల, గురునానక్ జయంతి 2024 తరువాత, ఈ సంవత్సరం కేవలం రెండు స్టాక్ మార్కెట్ సెలవులు మాత్రమే మిగిలి ఉన్నాయని ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి.
గురువారం ట్రేడింగ్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..
అంతర్జాతీయ మార్కెట్ల సెంటిమెంట్ బలహీనంగా ఉండటంతో భారత స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. దేశీయ సూచీలకు నష్టాలు ఇది వరుసగా ఆరోసారి! రియాల్టీ, ఆటో (ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు), టెలికాం, కన్స్యూమర్ షేర్లు లాభపడ్డాయి. అదే సమయంలో ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ (అధిక ఖర్చులు, తక్కువ వ్యయం కారణంగా నిరాశాజనక దృక్పథం) అత్యధికంగా పడిపోయాయి.
నిఫ్టీ 50 స్వల్పంగా నష్టపోయి 23,555 వద్ద ముగియగా, బీఎస్ఈ సెన్సెక్స్ ఆరు పాయింట్లు నష్టపోయి 77,684 వద్ద స్థిరపడింది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 139 పాయింట్లు లాభపడి 50,227 వద్ద ముగిసింది. బ్రాడ్ మార్కెట్లో స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.83 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.41 శాతం పెరిగాయి. ఎన్ఎస్ఈలో క్యాష్ మార్కెట్ వాల్యూమ్స్ 6 నెలల కనిష్టానికి దగ్గరగా ఉన్నాయి.
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1849.47 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2481.81 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
మొత్తం మీద చూసుకుంటే ఈ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు 29,533.17 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు మాత్రం రూ. 26,522.32 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
సంబంధిత కథనం