Stock market holiday : నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు..
Stock market holiday : దేశీయ స్టాక్ మార్కెట్లకు నేడు సెలవు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
Stock market holiday : స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు మంగళవారం మూతపడి ఉంటాయి. మళ్లీ బుధవారం ఉదయం ఓపెన్ అవుతాయి.
ట్రెండింగ్ వార్తలు
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో సెలవు. ఆగస్టు 16 సెటిల్మెంట్ హాలీడే. ఈ నేపథ్యంలో ఆగస్టు 14న చేసిన ట్రేడింగ్‌కు సంబంధించిన నిధులు.. ఆగస్ట్ 17న బ్రోకింగ్ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతాయని మదుపర్లు, ట్రేడర్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ మేరకు ఇప్పటికే నోటిఫికేషన్‌ను పంపించాయి.
ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్, ఎస్ఎల్బీ సెగ్మెంట్లు పనిచేయవు. కరెన్సీ డెరివేటివ్ సెగ్మెంట్ కూడా నేడు మూతపడే ఉంటుంది. అంతేకాకుండా.. కమోడిటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రెసిప్ట్స్ సెగ్మెంట్లకు కూడా నేడు సెలవు. ఎంస్ఎక్స్, ఎన్సీడీఈఎక్స్లో కార్యకలాపాలు కూడా ఉండవు.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఇలా..
Stock market holiday today : సోమవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 79 పాయింట్ల నష్టంతో 65,402 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 6 పాయింట్లు కోల్పోయి 19,434 వద్ద స్థిరపడింది. ఇక 108 పాయింట్ల నష్టంతో 44,010 వద్దకు చేరింది బ్యాంక్ నిఫ్టీ.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీలో వీక్నెస్ కొనసాగుతోంది. 19-600 లెవల్ పైన క్లోజ్ అయితే, అప్‌ట్రెండ్ మొదలవ్వొచ్చు. 19,300 లెవల్స్ కన్నా కిందపడితే, నిఫ్టీలో నెగిటివ్ ట్రెండ్ కన్ఫర్మ్ అవుతుంది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2324.23 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1460.0 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
India stock market news : ఇక ఈ నెలలో ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐలు రూ. 9,870.76 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. డీఐఐలు మాత్రం రూ. 6814.46 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
సంబంధిత కథనం