Multibagger stock: 24:100 బోనస్ షేర్లు ప్రకటించిన మల్టీ బ్యాగర్ కంపెనీ-stock below rs 100 declares 24 100 bonus shares scrip rallies 480 in 1 year ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Below <Span Class='webrupee'>₹</span>100 Declares 24:100 Bonus Shares, Scrip Rallies 480% In 1 Year

Multibagger stock: 24:100 బోనస్ షేర్లు ప్రకటించిన మల్టీ బ్యాగర్ కంపెనీ

HT Telugu Desk HT Telugu
Feb 18, 2023 07:13 PM IST

Multibagger stock: గ్రోయింగ్టన్ వెంచర్స్ లిమిటెడ్ (Growington Ventures) అనే స్మాల్ క్యాప్ కంపెనీ (Small-cap firm) తన ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Multibagger stock: గ్రోయింగ్టన్ వెంచర్స్ లిమిటెడ్ (Growington Ventures) అనే స్మాల్ క్యాప్ కంపెనీ (Small-cap firm) తమ షేర్ హోల్డర్లకు 24 : 100 రేషియోలో బోనస్ షేర్లను ప్రకటించింది. ఈ మేరకు బోనస్ షేర్ల ప్రతిపాదనకు సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదం తెలిపారు. అంటే, షేర్ హోల్డర్ల వద్ద ఉన్న ప్రతీ 100 షేర్లకు 24 షేర్లను బోనస్ గా ఇవ్వనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Multibagger stock: షేర్ క్యాపిటల్..

ప్రస్తుతమున్న రూ. 13.20 కోట్ల షేర్ క్యాపిటల్ ను రూ. 16.20 కోట్లకు పెంచాలని నిర్ణయించారు. అలాగే, రూ. 10 ముఖ విలువ కలిగిన షేర్ల సంఖ్యను 1.32 కోట్ల నుంచి 1.62 కోట్లకు పెంచనున్నారు. ఈ మేరకు షేర్ హోల్డర్లకు బోనస్ షేర్లు లభిస్తాయి. అంటే, షేర్ హోల్డర్ల వద్ద ఉన్న ప్రతీ 100 షేర్లకు 24 షేర్లను బోనస్ గా ఇవ్వనున్నారు. ఈ బోనస్ షేర్లు మార్చి 28 నాటికి షేర్ హోల్డర్ల డీ మ్యాట్ ఖాతాల్లో జమ అవుతాయని గ్రోయింగ్టన్ వెంచర్స్ (Growington Ventures) సంస్థ వెల్లడించింది.

Multibagger stock: పరుగులు తీసిన షేర్లు

స్టాక్ మార్కెట్లో గ్రోయింగ్టన్ వెంచర్స్ (Growington Ventures) షేర్ విలువ శుక్రవారం 52 వారాల గరిష్టమైన రూ. 82.90 కి చేరింది. గత ఐదేళ్లలో ఈ గ్రోయింగ్టన్ వెంచర్స్ (Growington Ventures) షేర్ వాల్యూ రూ. 14 నుంచి ఇప్పుడున్న రూ. 82.00 కి చేరడం విశేషం. అంటే ఈ మల్టీ బ్యాగర్ షేర్ ఈ ఐదేళ్లలో 448.9% వృద్ధి సాధించింది. అలాగే, గత మూడేళ్లలో ఈ షేరు విలువ రూ. 29.60 నుంచి ప్రస్తుత స్థాయికి పెరిగింది. గ్రోయింగ్టన్ వెంచర్స్ (Growington Ventures) ప్రీమియం పండ్ల ఎక్స్ పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్ లో కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది.

WhatsApp channel