స్టీల్‌బర్డ్ హెల్మెట్స్ కొత్తగా టోర్నాడో హెల్మెట్ సిరీస్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ హెల్మెట్‌లను భారతీయ (ISI), అంతర్జాతీయ (DOT) ప్రమాణాలు రెండింటికీ అనుగుణంగా తయారు చేయడం జరిగింి. సాధారణ కమ్యూటర్ హెల్మెట్‌ల విభాగంలోకి వచ్చే ఈ టోర్నాడో హెల్మెట్ ధర రూ. 1,959 మాత్రమే! ఈ నేపథ్యంలో ఈ హెల్మెట్స్ గురించి ఇక్కడ తెలుసుకోందాము..
వివిధ సైజుల్లో లభ్యత: టోర్నాడో హెల్మెట్ నాలుగు విభిన్న సైజుల్లో అందుబాటులో ఉంది. అవి.. ఎస్ (560ఎంఎం), ఎం (580ఎంఎం), ఎల్ (600ఎంఎం), ఎక్స్ఎల్ (620ఎంఎం). ఇది వివిధ రకాల వినియోగదారుల అవసరాలకు సరిపోయేలా రూపొందించడం జరిగింది.
మైక్రో-మెట్రిక్ బకిల్: ఈ హెల్మెట్‌లో యూరోపియన్ ఫాస్టెనింగ్ ప్రమాణాలకు కట్టుబడి ఉండే మైక్రో-మెట్రిక్ బకిల్ ఉపయోగించడం జరిగింది. ఇది ఇప్పుడు మిడ్ లెవల్ హెల్మెట్‌లలో సాధారణంగా చూస్తున్న ఫీచర్.
అధిక-నాణ్యత నిర్మాణం: హెల్మెట్ బయటి భాగం అధిక-నాణ్యత కలిగిన ఏబీఎస్ షెల్‌తో రూపొందించారు. ఇది ప్రమాదాల నుంచి తలకు రక్షణ కల్పించడానికి, పగుళ్లను తట్టుకోవడానికి వీలుగా ఉంటుంది.
మల్టీ-లేయర్ ఈపీఎస్ ఫోమ్: 2 వీలర్ డ్రైవర్ల కోసం రూపొందించిన ఈ హెల్మెట్ లోపలి భాగంలో, షాక్ అబ్జార్ప్షన్ కోసం బహుళ-పొరల, అధిక సాంద్రత కలిగిన ఈపీఎస్ ఫోమ్ ఉంటుంది. దీనికి ఫైబర్‌గ్లాస్ రీఎన్‌ఫోర్స్‌మెంట్ కూడా ఉంది. DOT ప్రమాణాలకు ఇది తప్పనిసరి. స్టీల్బర్డ్కి చెందిన చాలా DOT-రేటెడ్ హెల్మెట్‌లలో ఈ పదార్థాన్ని ఉపయోగిస్తారు.
మెరుగైన భద్రత, దృశ్యమానత: హెల్మెట్‌లో వెనుక భాగంలో రిఫ్లెక్టివ్ స్పాయిలర్, లోపలి ప్యాడింగ్ వంటి రిఫ్లెక్టివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి రాత్రి సమయంలో రైడర్ దృశ్యమానతను పెంచుతాయి. అన్ని భాగాలు (చిన్ స్ట్రాప్, లోపలి భాగం, బకిల్, రిఫ్లెక్టర్) నలుపు రంగులో ఉండే “బ్లాక్ అవుట్ ఎడిషన్”ని కూడా సంస్థ పరిచయం చేసింది.
డ్యూయల్-వైజర్ సిస్టమ్: టోర్నాడోలో డ్యూయల్-వైజర్ సిస్టమ్ ఉంది. ఇది వివిధ లైటింగ్ పరిస్థితులను సులభంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. పగటిపూట రైడర్‌లు అంతర్నిర్మిత సన్ వైజర్‌ను ఉపయోగించవచ్చు. స్మోక్-టింటెడ్ ఔటర్ వైజర్‌ను క్విక్-రిలీజ్ మెకానిజం ద్వారా సులభంగా మార్చుకోవచ్చు.
మెరుగైన సౌకర్యం: ఈ హెల్మెట్‌లో ముఖ్యమైన మార్పులలో ఒకటి, చిన్ స్ట్రాప్ చెక్ ప్యాడ్ మధ్య నుంచి బయటకు వచ్చేలా తిరిగి రూపొందించడం. ఇది చెవులకు ఎక్కువ స్పేస్‌ని అందించడం ద్వారా ఎక్కువసేపు హెల్మెట్ ధరించినప్పుడు లేదా బ్లూటూత్ పరికరాలను ఉపయోగించినప్పుడు సౌకర్యాన్ని పెంచుతుంది.
శుభ్రత, దీర్ఘకాల వినియోగం: హెల్మెట్ లోపలి భాగంలో రిమూవెబుల్, వాషెబుల్ బ్రీతబుల్ లైనర్ ఉంది. ఇది చాలా కమ్యూటర్-కేంద్రీకృత హెల్మెట్‌లలో సాధారణ ఫీచర్. ఇది పరిశుభ్రత, దీర్ఘకాల వినియోగ సమస్యలను పరిష్కరిస్తుంది.
హెల్మెట్‌లతో పాటు స్టీల్‌బర్డ్ చేతి తొడుగులు, గాగుల్స్. రెయిన్‌వేర్ వంటి రైడింగ్ యాక్సెసరీలను కూడా పరిచయం చేసింది. ఇది లైఫ్‌స్టైల్ ఉత్పత్తుల వైపు మారుతున్న సంకేతం. భారతదేశంలో 200కి పైగా ఎక్స్‌క్లూజివ్ రైడర్ షాపులతో తన రిటైల్ నెట్‌వర్క్‌ను కూడా పెంచుకుంటోంది. రాబోయే కొన్నేళ్లలో ఈ సంఖ్యను గణనీయంగా పెంచి 1,000 స్వతంత్ర షాపులను చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
సంబంధిత కథనం
టాపిక్