SBI Amrit Kalash: అమృత కలశ్ ఎఫ్ డీ స్కీమ్ ని పొడిగించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ లో ఈ అమృత కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ చాలా పాపులర్ అయింది. దాంతో ఈ స్కీమ్ ని డిసెంబర్ 31, 2023 వరకు పొడిగించాలని బ్యాంక్ నిర్ణయించింది. ఈ స్కీం ద్వారా పెట్టుబడి పెట్టిన వారికి 7.1 నుంచి 7.6 వరకు వార్షిక వడ్డీ రేటు లభిస్తుది. డిపాజిటర్ల నుంచి ఈ స్కీమ్ కి మంచి స్పందన లభిస్తున్న కారణంగా ఈ పథకాన్ని ఎస్బీఐ ఇప్పటికే పలుమార్లు పొడిగించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 15న ఈ అమృత కలర్స్ ఎఫ్ డీ స్కీమ్ ని ఎస్బీఐ ప్రారంభించింది. 400 రోజుల గడువుతో ఈ స్కీం ఉంటుంది.
ఈ అమృత కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ లో 400 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ కు సాధారణ కస్టమర్లకి 7.1% వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజెన్లకి 7.6% వడ్డీ లభిస్తుంది. వడ్డీని నెలవారీగా లేదా మూడు నెలలకోసారి లేదా ఆరు నెలలకోసారి, కస్టమర్ల కోరిక మేరకు బ్యాంక్ కస్టమర్ల ఖాతాలో జమ చేస్తుంది. ఎస్బిఐ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.