మీ పాత వాహనాన్ని స్మార్ట్‌గా చేయెుచ్చు.. బయోమెట్రిక్‌తో యాక్సెస్ చేసి ఆన్ చేసుకోవచ్చు-spark minda launches biometric fingerprint vehicle access system make your old vehicle smart ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మీ పాత వాహనాన్ని స్మార్ట్‌గా చేయెుచ్చు.. బయోమెట్రిక్‌తో యాక్సెస్ చేసి ఆన్ చేసుకోవచ్చు

మీ పాత వాహనాన్ని స్మార్ట్‌గా చేయెుచ్చు.. బయోమెట్రిక్‌తో యాక్సెస్ చేసి ఆన్ చేసుకోవచ్చు

Anand Sai HT Telugu
Jan 28, 2025 04:35 PM IST

Fingerprint Sensor : ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌‌పో 2025 భారత మార్కెట్‌కు అనేక విధాలుగా ప్రత్యేకమైనదిగా ఉంది. ఆటో షోలో అనేక ప్రత్యేకమైన పరికరాలు కూడా కనిపించాయి. అందులో ఒకటి బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ వెహికల్ యాక్సెస్ సిస్టమ్.

స్కూటర్‌కు బయోమెట్రిక్‌
స్కూటర్‌కు బయోమెట్రిక్‌

ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌ పో 2025లో అనేక రకాల కార్లను విడుదల చేశారు. ఆటో షోలో ఎగిరే కారును కూడా తీసుకొచ్చారు. మరోవైపు పలు గొప్ప ఉత్పత్తులు కూడా కనిపించాయి. ఈ జాబితాలో స్పార్క్ మిండా కంపెనీకి చెందిన బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ వెహికల్ యాక్సెస్ సిస్టమ్ కూడా ఉంది. వాస్తవానికి ద్విచక్ర వాహనాన్ని స్మార్ట్‌గా చేయడానికి కంపెనీ ఈ వ్యవస్థను ప్రారంభించింది. డ్రైవర్ వేలిముద్రతో ఈ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత కూడా నడుస్తూనే ఉంటుంది.

హ్యాండి‌ల్‌కు సెట్ చేసుకోవచ్చు

బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ వెహికల్ యాక్సెస్ సిస్టమ్ ఒక చిన్న పరికరం. ఈ పరికరాన్ని వాహనం హ్యాండిల్ కుడి వైపున అమర్చుకోవచ్చు. ఇది వాహనం ఇంజిన్, ఇతర యంత్రాంగాలకు అనుసంధానించి ఉంటుంది. తరువాత వేలిని బయోమెట్రిక్‌తో తాకాల్సి ఉంటుంది. ఇందుకోసం ఫింగర్ ప్రింట్ ముందుగానే సెట్ చేసుకోవాలి. ఈ బయోమెట్రిక్ విధానంలో ఒకటి కంటే ఎక్కువ వేలిముద్రలను సెట్ చేసుకోవచ్చు. ఈ వ్యవస్థ చుట్టూ ఎల్ఈడి లైట్ ఉంది, ఇది వివిధ పరిస్థితులకు కూడా ప్రతిస్పందిస్తుంది. ఉదాహరణకు తప్పు వేలిముద్ర వేస్తే ఎరుపు కాంతి కనిపిస్తుంది.

ఇతర యక్ససరీలు

సాధారణ స్కూటర్‌ను స్మార్ట్‌గా మార్చే యాక్ససరీలను కూడా స్పార్క్ మిండా కంపెనీ ప్రవేశపెట్టింది. ఇందులో పెద్ద ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ హ్యాండిల్ లాక్, గ్లోవ్ బాక్స్, ఆన్సర్ బ్యాక్ యూనిట్, టీపీఎంఎస్ సెన్సార్, టిల్ట్ సెన్సార్, సైడ్ స్టాండ్ సెన్సార్, అనేక ఇతర పరికరాలు ఉన్నాయి. ఈ యాక్ససరీలన్నింటినీ ఏ ద్విచక్ర వాహనంలోనైనా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. వీటన్నింటితో పాటు ఎల్ఈడీ డీఆర్ఎల్‌లను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. అయితే వాటి ధర గురించి కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారాన్ని పంచుకోలేదు.

కంపెనీ ఈ యాక్ససరీలన్నింటినీ డెమో స్కూటర్‌లో డిస్ ప్లే చేయడానికి ఉంచింది. తద్వారా ప్రజలు ఈ యాక్సెసరీస్ గురించి మరింత మెరుగ్గా తెలుసుకోవచ్చు. కంపెనీ స్మార్ట్ కీని కూడా చూపించింది. దీనికి స్పార్క్ మిండా బ్రాండింగ్ కూడా ఉంది. మొత్తం మీద మీ దగ్గర పాత ద్విచక్ర వాహనం ఉంటే ఈ స్మార్ట్ యాక్సెసరీతో మరింత మెరుగ్గా తయారు చేసుకోవచ్చు. ఈ యాక్ససరీలు మీ వాహనాన్ని స్మార్ట్‌గా, సురక్షితంగా చేస్తాయి.

Whats_app_banner