సోనీ తన కొత్త బ్రావియా 8 II సిరీస్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో 4కే ఓఎల్ఈడీ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ఏఐ ప్రాసెసర్, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో కూడిన 55 అంగుళాల, 65 అంగుళాల మోడళ్లు ఉన్నాయి. ప్రీమియం విజువల్స్, సౌండ్ క్వాలిటీ కోరుకునే యూజర్ల కోసం ఈ టీవీలను రూపొందించారు. ఈ కొత్త సిరీస్ విశేషాల గురించి చూద్దాం..
సోనీ బ్రావియా 8 II సిరీస్ 55 అంగుళాల మోడల్ ధర రూ .2,46,990. 65 అంగుళాల మోడల్ ధర రూ.3,41,990గా ఉంది. సోనీ సెంటర్, సోనీ ఆన్లైన్ స్టోర్, ఇతర ప్రముఖ రిటైలర్లలో ఈ టీవీలు జూన్ 17, 2025 నుండి అందుబాటులో ఉన్నాయి. లాంచ్ ఆఫర్ కింద 55 అంగుళాల మోడల్ మీద రూ.10,000, 65 అంగుళాల మోడల్ మీద రూ.15,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
సోనీ బ్రావియా 8 II సిరీస్ ఎక్స్‌ఆర్ ప్రాసెసర్ ను ఉపయోగిస్తుంది. ఇది అధునాతన ఏఐ టెక్నాలజీతో పిక్చర్ క్వాలిటీని ఆప్టిమైజ్ చేస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్‌తో స్మూత్ మోషన్, గొప్ప వివరాలను ఈ టీవీలు అందిస్తున్నాయి. ఓఎల్ఈడీ ప్యానెల్ బ్లాక్ లెవల్స్, కాంట్రాస్ట్‌ను పెంచుతుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్‌లతో ఈ టీవీలు సినిమా తరహా అనుభవాన్ని అందిస్తాయి. బ్రావియా 8 II గేమింగ్ మోడ్‌ను కూడా కలిగి ఉంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వేరియబుల్ రిఫ్రెష్ రేట్(విఆర్ఆర్) ఉన్న గేమర్లకు అనువైనది.
సోనీ బ్రావియా 8 II సిరీస్ డిజైన్ స్లిమ్, సొగసైనది. 55 అంగుళాలు, 65-అంగుళాల మోడళ్లు ఫ్లష్ సర్ఫేస్ డిజైన్ను కలిగి ఉంటాయి. ఇది స్క్రీన్, ఫ్రేమ్ మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. స్టాండ్ డిజైన్ సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ సిరీస్ గూగుల్ టీవీ ప్లాట్‌ఫామ్‌ను కలిగి ఉంది. ఇది స్ట్రీమింగ్ సేవలు, యాప్స్‌కు వినియోగదారులకు ఈజీగా ఉంటుంది. ఇందులో బిల్ట్-ఇన్ క్రోమ్కాస్ట్ మరియు అలెక్సా సపోర్ట్ కూడా ఉంది. ఇది స్మార్ట్ హోమ్ ఇంటిగ్రేషన్‌ను సులభతరం చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సీన్ రికగ్నిషన్ సిస్టమ్ రియల్ టైమ్‌లో పిక్చర్ క్వాలిటీని అడ్జస్ట్ చేస్తుంది.