యుద్ధం లాంటి పరిస్థితి తలెత్తితే ఈ పరికరాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి!-some gadgets useful in war like situations checkout these 5 things ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  యుద్ధం లాంటి పరిస్థితి తలెత్తితే ఈ పరికరాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి!

యుద్ధం లాంటి పరిస్థితి తలెత్తితే ఈ పరికరాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి!

Anand Sai HT Telugu

యుద్ధం లాంటి పరిస్థితి తలెత్తితే కొన్ని రకాల పరికరాలు క్లిష్ట సమయాల్లో ఉపయోగపడతాయి. ఈ గాడ్జెట్లు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండటం మంచింది.

ప్రతీకాత్మక చిత్రం

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తితలు పెరిగాయి. ఇప్పటికే మాక్ డ్రిల్ కూడా జరిగింది. అటువంటి పరిస్థితిలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడైనా యుద్ధం లాంటి పరిస్థితి తలెత్తితే, లేదంటే అలాంటి ప్రదేశాల్లో మీరు ఉంటే.. కొన్ని గాడ్జెట్‌లు ఉపయోగపడతాయి. వాటి గురించి చూద్దాం..

సౌరశక్తితో నడిచే పవర్‌బ్యాంక్

యుద్ధం వంటి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు సరిగ్గా పనిచేయాలంటే.. వాటి బ్యాటరీ అయిపోకుండా ఉండటం ముఖ్యం. ఎక్కువసేపు విద్యుత్ కోతలు ఉన్నప్పుడు మీరు సౌరశక్తితో నడిచే పవర్ బ్యాంక్‌ను మీతో ఉంచుకోవడం మంచిది. ఈ పవర్ బ్యాంక్ ఎలాంటి విద్యుత్ లేకుండానే ఛార్జ్ అవుతుంది. మీ పరికరాలు కూడా పనిచేస్తూనే ఉంటాయి.

ఎఫ్ఎం రెడియో

యుద్ధం లాంటి పరిస్థితి ఎప్పుడైనా తలెత్తితే.. మీకు ఎఫ్ఎం రేడియో ఉండాలి. మొబైల్ నెట్‌వర్క్ ప్రభావితమైతే.. రేడియో సహాయంతో కమ్యూనికేషన్ మీకు అర్థమవుతుంది. యుద్ధం లాంటి పరిస్థితిలో మీతో చిన్న లేదా కాంపాక్ట్ రేడియో ఉంచుకోవడం అవసరం అవుతుంది. దీనితో మీరు నిరంతర అప్డేట్స్ పొందుతారు.

గ్యాస్ లీక్ డిటెక్టర్, స్మోక్ సెన్సార్

దాడి లేదా పేలుడు సంభవించినప్పుడు గ్యాస్ లీకేజీ కారణంగా నష్టం జరిగే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో గ్యాస్ లీక్ సెన్సార్ లేదా స్మోక్ అలారం మీ ప్రాణాలను కాపాడటానికి సహాయపడుతుంది. ఈ పరికరాలు అలారం మోగించడం ద్వారా లీకేజీ గురించి మిమ్మల్ని అలర్ట్ చేస్తాయి.

సోలార్ టార్చ్

విద్యుత్తు అంతరాయం లేదా ఎక్కువసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోతే, మీకు లైట్లు లేదా టార్చి అవసరం కావచ్చు. చాలా సందర్భాలలో ఒక చిన్న టార్చ్ చేతిలో ఉండటం చాలా విలువైనదిగా మారుతుంది. కొన్నిసార్లు అదే మీకు దారి చూపిస్తుంది.

మల్టీటూల్ సర్వైవల్ కిట్

అత్యవసర పరిస్థితిలో మల్టీటూల్ కిట్‌ను కలిగి ఉండాలి. అందులో కత్తి నుండి స్క్రూడ్రైవర్, వైర్ కట్టర్లు, ఫైర్ స్టార్టర్, బాటిల్ లేదా డబ్బా ఓపెనర్ వరకు ఉపయోగకరమైన వస్తువులు ఉంటాయి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.