AP tops in voice searches in India: వాయిస్ సెర్చ్ ల్లో ఏపీ టాప్-softbrik new study reveals a 78 per cent increase in voice searches in india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Softbrik: New Study Reveals A 78 Per Cent Increase In Voice Searches In India

AP tops in voice searches in India: వాయిస్ సెర్చ్ ల్లో ఏపీ టాప్

HT Telugu Desk HT Telugu
Dec 06, 2022 04:49 PM IST

AP tops in voice searches in India: ట్రెండింగ్ టెక్నాలజీని అందిపుచ్చకోవడంలో తెలుగు వారు ముందుంటారని మరోసారి రుజువైంది. సంప్రదాయ టెక్స్ట్ సెర్చ్ కు బదులుగా.. వాయిస్ ఆధారంగా సెర్చ్ ఇంజిన్ లలో మనకు అవసరమైన విషయాలను సెర్చ్ చేసే విషయంలోనూ తెలుగువారు ముందున్నారని మరోసారి తేలింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

AP tops in voice searches in India: ‘సాఫ్ట్ బ్రిక్ ఏఐ(Softbrik AI)’ అనే యురోపియన్ టెక్ కంపెనీ ఇటీవల భారత్ లో ఒక అధ్యయనం చేసింది. భారత్ లో టెక్స్ట్ సెర్చ్, వాయిస్ సెర్చ్ లను ఉపయోగిస్తున్న వారి గురించి ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

OK Google: ఓకే గూగుల్, హే గూగుల్

సాధారణంగా మనకు కావాల్సిన సమాచారాన్ని గూగుల్ సెర్చ్ లో టైప్ చేసి తెలుసుకుంటాం. అదే విషయాన్ని మన మాటల ద్వారా కమాండ్ ఇచ్చి కూడా తెలుసుకోవచ్చన్న విషయం తెలిసిందే. కాకపోతే, అలవాటైన మార్గం కనుక చాలామంది టెక్స్ట్ సెర్చ్ ద్వారానే విషయ సేకరణ చేస్తుంటారు. అయితే, ఇటీవలి కాలంలో వాయిస్ సెర్చ్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరగుతోంది. 2021లో పోలిస్తే.. 2022లో వాయిస్ సెర్చ్ ల వినియోగం ఏకంగా 78% పెరిగిందని ‘సాఫ్ట్ బ్రిక్ ఏఐ(Softbrik AI)’ అధ్యయనంలో తేలింది.

Telugu states: తెలుగు రాష్ట్రాలు

ఈ వాయిస్ సెర్చ్ లో భారత్ లో తొలి స్థానంలో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ ఉంది. ఆ తరువాత స్థానంలో అండమాన్ నికోబార్ ఉంది. మూడో స్థానంలో మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ ఉంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం తదుపరి స్థానాల్లో నిలిచాయి. మరోవైపు, ఈ వాయిస్ సెర్చ్ విషయంలో దేశ రాజధాని ఢిల్లీ, చండీగఢ్, కేరళ చివరి స్థానాల్లో ఉండడం విశేషం. కాగా, గూగుల్ కే కాకుండా, ఆమెజాన్ అలెక్సా, యాపిల్ సిరి ల సేవలు పొందుతున్న వారి సంఖ్యకూడా గణనీయంగా పెరిగిందని సాఫ్ట్ బ్రిక్(Softbrik) సహ వ్యవస్థాపకుడు రోమిత్ చౌదరి వెల్లడించారు. సాధారణంగా, టైప్ చేసే సమయం కన్నా వాయిస్ సెర్చ్ కు తక్కువ సమయం పట్టడం కూడా ఈ ఆప్షన్ కు ఆదరణ పెరగడానికి కారణం.

Voice based surveys: వాయిస్ బేస్డ్ సర్వేలు

సాధారణంగా సర్వే అనగానే, చాలా డిటైల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆన్ లైన్ సర్వేకు కూడా ఆన్ లైన్ ఫామ్స్ నింపడం లేదా ఏదైనా రివ్యూ ఇవ్వాలన్న చాలా టెక్స్ట్ ను టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ సమస్య లేకుండా వాయిస్ బేస్డ్ సర్వే సేవలను ఈ సాఫ్ట్ బ్రిక్(Softbrik) అందిస్తుంది. దీని ద్వారా.. సర్వేలో పాల్గొనాలన్నా.. ఏదైనా రెస్టారెంట్ గురించి కానీ, ప్రొడక్ట్ గురించి కానీ రివ్యూ ఇవ్వాలన్నా సింపుల్ గా.. సంబంధిత లింక్ ఓపెన్ చేసి, మాటల్లోనే మన రివ్యూ ఇవ్వొచ్చు. ఈ డిటైల్స్ ను క్రోడీకరించి సాఫ్ట్ బ్రిక్(Softbrik) రేటింగ్స్ ను ఇస్తుంది.

WhatsApp channel