Small savings scheme: చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం
Small savings scheme: పీపీఎఫ్, ఎన్ఎస్సీ సహా వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే త్రైమాసికానికి కూడా గత వడ్డీ రేట్లే కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
Small savings scheme: పీపీఎఫ్, ఎన్ఎస్సీ సహా వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ఏప్రిల్ 1, 2025 నుంచి ప్రారంభమయ్యే 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కూడా గత వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. "2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు 2025 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికానికి (2025 జనవరి 1 నుండి 2025 మార్చి 31 వరకు) నోటిఫై చేసిన వాటి నుండి యథాతథంగా ఉంటాయి" అని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో తెలిపింది.
ఇవే వడ్డీ రేట్లు
నోటిఫికేషన్ ప్రకారం..
- సుకన్య సమృద్ధి పథకం కింద డిపాజిట్లపై 8.2 శాతం వడ్డీ రేటు ఉంది.
- మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై వడ్డీ రేటు ఏప్రిల్ 2025 - జూన్ 2025 త్రైమాసికంలో 7.1 శాతంగా ఉంటుంది.
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పై వడ్డీ శాతం 7.1 శాతంగా ఉంటుంది.
- పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్ పథకాలపై వడ్డీ రేట్ 4 శాతంగా ఉంటుంది.
- కిసాన్ వికాస్ పత్రంపై వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంటుంది. కిసాన్ వికాస్ పత్రంపై పెట్టుబడులు 115 నెలల్లో మెచ్యూరిటీ అవుతాయి.
- నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పై వడ్డీ రేటు 2025 ఏప్రిల్-జూన్ కాలానికి 7.7 శాతంగా ఉంటుంది.
- ప్రస్తుత త్రైమాసికం మాదిరిగానే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇన్వెస్టర్లకు 7.4 శాతం రాబడిని ఇస్తుంది.
ప్రతీ మూడు నెలలకు
దీంతో ప్రధానంగా పోస్టాఫీసులు, బ్యాంకులు నిర్వహించే చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను వరుసగా ఐదో త్రైమాసికం కూడా యథాతథంగా ఉంచింది. ప్రభుత్వం చివరిసారిగా 2023-24 నాలుగో త్రైమాసికానికి కొన్ని పథకాల్లో మార్పులు చేసింది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి నోటిఫై చేస్తుంది.
సంబంధిత కథనం