Bonus shares : రెండేళ్లల్లో 100శాతం పెరిగిన స్టాక్! ఇప్పుడు ఒక్క షేరు ఉంటే 5 ఫ్రీ- ధర రూ. 20లోపే..
Bonus shares : రూ. 20లోపు ధరలో ట్రేడ్ అవుతున్న గుజరాత్ టూల్‌రూమ్ స్మాల్ క్యాప్ స్టాక్ బోనస్ షేర్లను ప్రకటించింది. ఒక్క షేరు ఉంటే, 5 షేర్లు ఉచితంగా ఇస్తున్నట్టు వెల్లడించింది. పూర్తి వివరాలు..
స్టాక్ మార్కెట్లో బోనస్ షేర్లు ఇచ్చే కంపెనీలకు మంచి డిమండ్ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే కంపెనీలు తమ ఇన్వెస్టర్లకు ఎప్పటికప్పుడు బోనస్ షేర్లూ ఇచ్చేందుకు చూస్తుంటాయి. ఇక ఇప్పుడు స్మాల్ క్యాప్ కంపెనీ అయిన గుజరాత్ టూల్ రూమ్ బోర్డు బోనస్ షేర్లను ఆమోదించింది. ఈ రూ. 20 కన్నా తక్కువ ధరలో ట్రేడ్ అవుతున్న ఈ కంపెనీ స్టాక్‌కి సంబంధించిన ఒక్క షేరు ఉంటే 5 షేర్లు ఉచితంగా లభిస్తాయి!
ఒక్క షేరు ఉంటే 5 ఫ్రీ..!
5:1 రేషియోలో బోనస్ షేర్లను ఆమోదించినట్టు సోమవారం ఎక్స్ఛేంజ్కి చెప్పింది గుజరాత్ టూల్‌రూమ్. 1 రూపాయి ముఖ విలువ కలిగిన షేరుపై 5 షేర్ల బోనస్ ఇస్తామని కంపెనీ తెలిపింది. అయితే దీనికి సంబంధించిన రికార్డు తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. 2025 మార్చి 1 లేదా అంతకంటే ముందు షేర్లను క్రెడిట్ చేస్తామని కంపెనీ స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్మాల్ క్యాప్ స్టాక్ రానున్న కాలంలో బోనస్ షేర్లకు సంబంధించిన రికార్డు డేట్‌ని ప్రకటిస్తుందని అంచనా వేస్తున్నారు.
గుజరాత్ టూల్‌రూమ్ షేర్ ప్రైజ్ హిస్టరీ..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకిన తర్వాత గుజరాత్ టూల్‌రూమ్ షేరు ధర రూ.18.04 స్థాయికి పడిపోయింది. గత ఏడాది కాలంలో కంపెనీ షేరు ధర 56 శాతం పతనమైంది. అయితే గత 6 నెలల్లో కంపెనీ షేర్లు 29 శాతానికి పైగా పెరిగాయి. గుజరాత్ టూల్‌రూమ్ స్టాక్ 52 వీక్ హై రూ.45.97. 52 వీక్ లో రూ.10.75గా ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.400 కోట్లకు పైగా ఉంది.
రెండేళ్లుగా కంపెనీ షేర్లను కలిగి ఉన్న ఇన్వెస్టర్లు 102 శాతానికి పైగా లాభం పొందారు. అదే సమయంలో గత 3 సంవత్సరాలలో, ఈ స్టాక్ తన పొజిషనల్ ఇన్వెస్టర్లకు 1400% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది.
2023లో గుజరాత్ టూల్‌రూమ్ స్టాక్ స్ల్పిట్ జరిగింది. కంపెనీ తన వాటాలను 10 భాగాలుగా విభజించింది. ఆ తర్వాత కంపెనీ షేర్ల ముఖ విలువను రూ.1కి తగ్గించింది.
కంపెనీ డబ్బులు సమీకరించిందా?
గుజరాత్ టూల్‌రూమ్ లిమిటెడ్ ఇప్పటికే విజయవంతంగా రూ.95.66 కోట్లు సమీకరించింది. బ్రిడ్జ్ ఇండియా ఫండ్, మల్టీట్యూడ్ గ్రోత్ ఫండ్ మొదలైన వాటి నుంచి కంపెనీ ఈ నిధులను సమీకరించింది. కంపెనీ ఈ డబ్బును ఆపరేషనల్ ప్రాక్టీస్ కోసం ఉపయోగిస్తుంది.
అయితే.. కేవలం బోనస్ షేర్ల ఆధారంగా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయడం సరికాదని గుర్తుపెట్టుకోవాలి. బోనస్ అనేది స్టాక్ ప్రైజ్‌లో అడ్జెస్ట్ అవుతుందని గ్రహించాలి.
(గమనిక:- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హెచ్‌టీ తెలుగుకు సంబంధం లేదు. ఏదైనా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం