Tips to boost Internet speed : స్లో ఇంటర్నెట్​తో విసుగెత్తిపోయారా? ఇవి ట్రై చేయండి!-slow internet issues check out these 5 cool hacks to boost speed ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Slow Internet Issues? Check Out These 5 Cool Hacks To Boost Speed

Tips to boost Internet speed : స్లో ఇంటర్నెట్​తో విసుగెత్తిపోయారా? ఇవి ట్రై చేయండి!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 31, 2022 01:29 PM IST

Tips to boost Internet speed : మీ ఇంటర్నెట్​ స్లోగా ఉందా? స్లో ఇంటర్నెట్​తో విసుగెత్తిపోయారా? అయితే ఇవి ట్రై చేసి.. మీ ఇంటర్నెట్​ స్పీడ్​ని పెంచుకోండి..

స్లో ఇంటర్నెట్​తో విసుగెత్తిపోయారా? ఇలా చేయండి..
స్లో ఇంటర్నెట్​తో విసుగెత్తిపోయారా? ఇలా చేయండి.. (AFP)

Tips to boost Internet speed : ఈ టెక్​ యుగంలో ఇంటర్నెట్​ లేకపోతే ఏం జరగట్లేదు. ఛాటింగ్​ నుంచి బ్యాంక్​ లావాదేవీల వరకు.. అన్నింటికీ ఇంటర్నెట్​ కావాల్సిందే. ఇంటర్నెట్​ ఉండటమే కాకుండా.. అది స్పీడ్​గా కూడా పనిచేయాల్సిందే! స్లో ఇంటర్నెట్​తో ఇంకా ఎక్కువ చిరాకు వస్తుంది మరి..! స్లో ఇంటర్నెట్​ వల్ల చాలా మంది నిత్యం ఇబ్బందులు పడుతుంటారు. వీరిలో మీరు కూడా ఉన్నారా? అయితే ఇంటర్నెట్​ స్పీడ్​ను పంచుకునేందుకు ఉపయోగపడే ఈ టిప్స్​ మీకసమే..

ట్రెండింగ్ వార్తలు

లైట్​ వర్షెన్​ వాడండి..

క్రోమ్​ వంటి బ్రౌజర్స్​కు సంబంధించిన 'లైట్​' వర్షెన్​ను వాడండి. రెగ్యులర్​ వర్షెన్​తో పోల్చుకుంటే.. ఈ లైట్​ వర్షెన్​లో డేటా సేవ్​ అవుతుంది, పేజ్​ లోడ్​ ఫాస్ట్​గా అవుతుంది. మీకు స్లో ఇంటర్నెట్​ ఉన్నా.. వెబ్​ పేజ్​లను మీరు వేగంగా యాక్సెస్​ చేసుకోవచ్చు.

అనవసరమైన ట్యాబ్స్​ను క్లోజ్​ చేయండి..

How to fix slow internet issues : ఈ టిప్​తో మీ ఇంటర్నెట్​ వేగం పెరుగుతుంది. వెబ్​పేజ్​లు, ట్యాబ్​లు బ్యాక్​గ్రౌండ్​లో ఎప్పటికప్పుడు రిఫ్రెష్​ అవుతూనే ఉంటాయి. వీటికి ఇంటర్నెట్​ అవసరం ఉంటుంది. స్లో ఇంటర్నెట్​ సమస్యలు ఉన్నప్పుడు.. ఇవి పరిస్థితిని ఇంకా నెమ్మదిగా చేసేస్తాయి. అందుకే.. మీకు అనవసరమైన ట్యాబ్స్​ను, వెబ్​పేజ్​లను క్లోజ్​ చేయండి.

వైఫై రౌటర్​..

మీ ఇంట్లో ఎక్కడైతే వేగవంతమైన ఇంటర్నెట్​ వస్తుందో ముందే చూసుకోండి. అక్కడ వైఫై రౌటర్​ను పెట్టాల్సి ఉంటుంది. ఆ రౌటర్​ చుట్టూనే.. మీరు మీ వర్క్​ స్టేషన్​ను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. సిగ్నల్స్​ తక్కువగా ఉన్నట్టు చోట రౌటర్​ పెట్టడం లేదా వర్క్​ స్టేషన్​ను ఏర్పాటు చేయడం వల్ల.. స్లో ఇంటర్నెట్​ సమస్యలు విసిగిస్తూనే ఉంటాయి.

తక్కువ డివైజ్​లు కనెక్ట్​ చేసుకోవాలి..

how to improve Internet speed : మీ ఇంటర్నెట్​ సోర్స్​కి.. ఎంత తక్కువ డివైజ్​లు కనెక్ట్​ అయ్యి ఉంటే అంత మంచిది. స్మార్ట్​ టీవీ, ల్యాప్​టాప్స్​, స్మార్ట్​ఫోన్స్​.. ఇలా అన్నీ ఒకటే వైఫైకి కనెక్ట్​ చేస్తే.. ఇంటర్నెట్​ స్పీడ్​ ప్రభావితమవుతుంది. ల్యాప్​టాప్స్​ వాడకపోతే.. వాటిని ఎయిరోప్లేన్​ మోడ్​లో పెట్టండి. సెల్​ఫోన్స్​కి వైఫై అవసరం లేనప్పుడు.. డేటా మోడ్​ ఆన్​ చేసుకోండి.

వీడియో రిసొల్యూషన్​..

Internet speed boosting tips : వీడియో స్ట్రీమింగ్​ వెళ స్లో ఇంటర్నెట్​ ఉంటే.. ఆ చిరాకు నెక్స్ట్​ లెవల్​లో ఉంటుంది కదూ..! ఈ సందర్భాల్లో వీడియో స్ట్రీమింగ్​ రిసొల్యూషన్​ను తగ్గించుకోండి. ఫలితంగా బఫరింగ్​ టైమ్​ తగ్గే అవకాశం ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం