Personal loan interest : లోన్​ తీసుకున్న తర్వాత కూడా వడ్డీ రేటును తగ్గించుకోవచ్చు! ఎలా అంటే..-slash your personal loan interest proven strategies to save big ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Personal Loan Interest : లోన్​ తీసుకున్న తర్వాత కూడా వడ్డీ రేటును తగ్గించుకోవచ్చు! ఎలా అంటే..

Personal loan interest : లోన్​ తీసుకున్న తర్వాత కూడా వడ్డీ రేటును తగ్గించుకోవచ్చు! ఎలా అంటే..

Sharath Chitturi HT Telugu

Personal loan interest rates : అధిక వడ్డీ రేటుకు పర్సనల్​ లోన్​ తీసుకుని, దాన్ని కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇది మకోసమే! లోన్​ తీసుకున్న తర్వాత కూడా వడ్డీ రేటును తగ్గించుకోవచ్చన్న విషయం మీకు తెలుసా? ఎలా అంటే..

అధిక వడ్డీ రేటుకు పర్సనల్​ లోన్​ తీసుకున్నారా?

డబ్బు అవసరాల కోసం ఇప్పుడు చాలా మంది పర్సనల్​ లోన్​వైపు చూస్తున్నారు. కానీ పర్సనల్​ లోన్​లో వడ్డీ రేట్లు సాధారణ రుణాల కన్నా అధికంగా ఉంటాయి. దీని వల్ల లోన్​ తీసుకున్న వారిపై భారం పెరుగుతుంది. మీరు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారా? పర్సనల్​ లోన్​ వడ్డీ భారాన్ని తట్టుకోలేకపోతున్నారా? అయితే ఇది మీకోసమే! లోన్​ తీసుకున్న తర్వాత కూడా వడ్డీ రేటును తగ్గించుకోవచ్చు అన్న విషయం మీకు తెలుసా? ఎలా అంటే..

మీ క్రెడిట్ స్కోరును మెరుగుపరుచుకోండి..

పర్సన్​ లోన్​ ఒక్కటే కాదు, ఏ లోన్​ విషయంలోనైనా మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండటం చాలా అవసరం! తద్వారా మీరు మంచి రుణాన్ని పొందవచ్చు. మీరు నమ్మదగిన వ్యక్తి అని మీ క్రెడిట్​ స్కోర్​, మీకు లోన్​ ఇచ్చిన వ్యక్తికి తెలియజేస్తుంది. దీనికి మీరు తక్కువ వడ్డీ రేట్లను పొందుతారు. ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించండి. మీ క్రెడిట్-అర్హత, క్రెడిబులిటీ నమ్మకాన్ని మెరుగుపరచడానికి మీ క్రెడిట్ యుటిలిటీ రేషియోని 30% కంటే తక్కువగా ఉంచండి. క్రెడిట్ రిపోర్టులో తప్పుల ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు చెక్​ చేసుకోండి.

మీ రుణదాతతో సంప్రదింపులు..

మీరు మీ బ్యాంకు రెగ్యులర్ కస్టమర్ అయినా లేదా మీ ఈఎంఐలకు క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తుంటే, మీరు మీ రుణదాతతో నెగోషియేట్​ చేసి పర్సనల్​ లోన్​పై వడ్డీ రేటును తగ్గించుకోవచ్చు. మీ కేసును బలోపేతం చేయడానికి వేతన స్లిప్పులు, స్థిరమైన చెల్లింపులు, ఆదాయపు పన్ను రిటర్నుల రూపంలో మీ ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన సాక్ష్యాలను మీ బ్యాంకు లేదా రుణ సంస్థకు చూపించండి. 

బ్యాంకులు ఎల్లప్పుడూ రెగ్యులర్ కస్టమర్లకు మెరుగైన నిబంధనలను అందించడానికి సిద్ధంగా ఉంటాయి. ముఖ్యంగా పండుగ సీజన్లు లేదా ప్రమోషనల్ ఆఫర్ల సమయంలో ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. మీ రుణ సంస్థతో బహిరంగ కమ్యూనికేషన్, నిష్పాక్షిక చర్చ ఇక్కడ కీలకం.

బ్యాలెన్స్ ట్రాన్స్​ఫర్ ఆప్షన్లు..

తక్కువ వడ్డీ రేటు ఇస్తున్న ఇతర బ్యాంకుకు మీ ప్రస్తుత లోన్​ని ట్రాన్స్​ఫర్​ చేసుకోవచ్చు. దీనిని బ్యాలెన్స్ ట్రాన్స్​ఫర్​ అంటారు. ఇది ఇతర బ్యాంకులు అందించే మెరుగైన నిబంధనలను సద్వినియోగం చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

ఉదాహరణకు: ఇండస్ఇండ్ బ్యాంక్ 10.49 శాతం వడ్డీకి పర్సనల్ లోన్స్ ఇస్తుండగా, ఆర్​బీఐ ఇటీవల రెపో రేటు తగ్గించిన తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడ్డీ రేట్లను 10 శాతానికి కట్​ చేసింది.

అందువల్ల, రుణం పొందిన తర్వాత కూడా మీ వ్యక్తిగత రుణ వడ్డీ రేటును తగ్గించడానికి ఇటువంటి వ్యూహాలను అమలు చేయడాన్ని మీరు పరిగణించవచ్చు.

ఇతర సమర్థవంతమైన వ్యూహాలు..

  • రుణ కాలపరిమితిని పెంచండి: రుణదాతలు దీర్ఘకాలిక రుణ కాలపరిమితి కోసం తక్కువ వడ్డీ రేట్లను వసూలు చేయవచ్చు. అయితే ఇది దీర్ఘకాలికంగా ఎక్కువ మొత్తంలో వడ్డీ చెల్లించడానికి దారితీస్తుంది. మీ రుణ కాలపరిమితిని పెంచడానికి సంబంధించి ఏదైనా హిడెన్​ ఛార్జీలు ఉన్నాయో లేదో కూడా మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి.
  • ప్రత్యేక ఆఫర్ల కోసం చూడండి: రుణదాతల కాలానుగుణ డిస్కౌంట్లు, ప్రమోషనల్ ఆఫర్ల కోసం చూడండి. ఇవి తాత్కాలిక పరిష్కారాలు.
  • లో- డెట్​ టు ఇన్​కమ్​ రేషియో: మీ రుణాలను అదుపులో ఉంచడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణను ప్రదర్శించడం వల్ల మరింత అనుకూలమైన రుణ నిబంధనలు కూడా వస్తాయి.

(గమనిక- లోన్​ తీసుకోవడం రిస్క్​తో కూడుకున్న వ్యవహారం అని గుర్తుపెట్టుకోండి.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం