Skoda Electric Car : భారత్‌లో స్కోడా తొలి ఎలక్ట్రిక్ కారు వచ్చేందుకు ప్లానింగ్.. కానీ ఈ ఒక్క చిన్న కన్ఫ్యూజన్!
Skoda Electric Car : స్కోడా తన మొదటి ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో విడుదల చేసేందుకు ప్రణాళిలు వేస్తోంది. కానీ స్కోడా ఇండియా తన మెుదటి ఎలక్ట్రిక్ మోడల్‌గా దేనిని విడుదల చేస్తుందనే దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు.

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను చూసి స్కోడా ఇండియా కూడా తన ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సెప్టెంబర్ 2025 నాటికి భారతీయ రోడ్లపైకి తీసుకువస్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే.. అది ఎన్యాక్ iV అవుతుందా లేదా ఎల్రోక్ అవుతుందా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.
స్కోడా మొదటి ఈవీ ఏది?
భారతదేశంలో స్కోడా మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం ఎన్యాక్ ఐవీ అని గతంలో వార్తలు వచ్చాయి. 2024లో వస్తుందని కూడా కొన్నిసార్లు ప్రచారం జరిగింది. అయితే ఇది ఆలస్యమైంది. ఇప్పుడు కంపెనీ జాబితాలో ఎల్రోక్, ఎన్యాక్ కూపేలను కూడా చేర్చింది. స్కోడా ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పీటర్ జానెబా ప్రకారం మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సెప్టెంబర్ 2025 నాటికి విడుదల అవుతుంది. కానీ అది ఎన్యాక్ ఐవీ అవుతుందా లేదా ఎల్రోక్ అవుతుందా అని ఆయన స్పష్టం చేయలేదు.
ఈవీ పాలసీ
స్కోడా ఇండియా ప్రస్తుతం భారత ప్రభుత్వ ఈవీ పాలసీ కోసం వేచి ఉంది. ఇది మార్చి 2025 నాటికి ఖరారు అవుతుందని భావిస్తున్నారు. దీని ప్రకారం కారు ధర సుమారు రూ.29 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, కంపెనీ భారతదేశంలో ఈవీ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తే అప్పుడు కస్టమ్ డ్యూటీ తక్కువగా ఉంటుంది. కంపెనీ ఈ షరతులను నెరవేర్చకపోతే, ఈవీ దిగుమతులపై భారీ కస్టమ్ డ్యూటీ విధిస్తారు. స్కోడా, వోక్స్‌వ్యాగన్ కూడా సంయుక్తంగా భారతదేశం కోసం స్థానిక ఈవీ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తున్నాయి.
స్కోడా ఎల్రోక్ ప్రదర్శన
అయితే ఇటీవల జరిగిన భారత్ మెుబిలిటీ ఆటో ఎక్స్‌లో స్కోడా ఎల్రోక్ కారు ప్రదర్శనకు ఉంచారు. ఇది మంచి డిజైన్‌తో ఉంది. ఎల్రోక్ ఇప్పటికే వివిధ వేరియంట్లతో విదేశాల్లో విక్రయిస్తున్నారు. ఇందులో 52kWh, 59kWh, 77kWh కెపాసిటీ గల బ్యాటరీలు ఉన్నాయి. అయితే భారత్‌లో ఎల్రోక్ ముందు తీసుకువస్తారా? లేదంటే.. ఎన్యాక్ ఐవీ వస్తుందా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.
స్కోడా మొదటి ఈవీ ఏది వస్తుందనే విషయంపై ఇంకా సస్పెన్స్ ఉంది. అది ఎన్యాక్ లేదా ఎల్రోక్ అవుతుందా? మార్చి 2025లో ఈవీ పాలసీ ఖరారు అయిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటారు. స్కోడా ఎలక్ట్రిక్ కారు భారతదేశంలో భారీ చాలా కంపెనీలకు పోటీ ఇవ్వనుంది.
కోడియాక్ ఎస్‌యూవీ
ఎలక్ట్రిక్ కార్లతో పాటు స్కోడా తన రెండో తరం కోడియాక్ ఎస్‌యూవీ కూడా త్వరలో భారతదేశంలో విడుదల చేయబోతోంది. దీని ఉత్పత్తి ఫిబ్రవరి 2025 నుండి ప్రారంభమవుతుంది. దీని ధర రూ. 40.99 లక్షల కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చని అంటున్నారు.