Skoda Elroq Electric SUV : అబ్బా ఏముంది భయ్యా.. క్రేజీ లుక్స్‌లో స్కోడా ఎలక్ట్రిక్ కారు!
Skoda Elroq Electric SUV Car : దిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పోలో మతిపోయే డిజైన్‌తో కార్లు ఉన్నాయి. స్కోడా ఎల్రాక్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు ప్రదర్శనకు ఉంది. దీనిని చూస్తే వార్ అనిపించేలా కనిపిస్తుంది.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్‌పో 2025 జరుగుతోంది. ఆటో మెుబైల్ పరిశ్రమకు ఇదో పండగలాంటిదని చెప్పవచ్చు. ఇందులో స్కోడా ఆటో ఇండియా పాల్గొంటోంది. ఎగ్జిబిషన్‌లో స్కోడాకు చెందిన వివిధ వెహికల్స్ ప్రదర్శనకు ఉన్నాయి. ఇందులో ఒకటి ఎల్రాక్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు. దీని గురించిన వివరాలు తెలుసుకుందాం..
స్కోడా భారతదేశంలోని అనేక కార్లను విక్రయిస్తోంది. స్కోడా కూడా ఎలక్ట్రిక్ కార్లవైపు వెళ్తుంది. కంపెనీ తన కొత్త ఎల్రాక్ ఎలక్ట్రిక్ కారును ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శించింది. ఈ కారు మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందోనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. లుక్స్ పరంగా మాత్రం ఎల్రాక్ స్కోడా సరికొత్త డిజైన్‌తో ఉంది.
ఇందులోని ఫీచర్లు
కారు ముందు భాగంలో ఎల్ఈడీ డీఆర్ఎల్‌లు 4 విభాగాలలో అమర్చబడి ఉంటాయి. ఈ డీఆర్ఎల్‌ల కింద హెడ్‌లైట్లు బంపర్‌పై అందించారు. ఈ హెడ్‌లైట్లు ఎల్ఈడీ మ్యాట్రిక్స్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. మొత్తంమీద ఎల్రాక్ లుక్ స్కోడా కొడియాక్ మాదిరిగానే ఉంది. స్కోడా కొడియాక్ ఎస్‌యూవీ ఆటో ఎక్స్‌పో 2025లో కూడా ప్రదర్శనకు ఉంది.
ఎల్రాక్ ఎలక్ట్రిక్ కారు 21 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఉంటుంది. వెనుక భాగం కూడా స్కోడా ఆధునిక ఎస్‌యూవీని పోలి ఉంటుంది. కారు వెనుక భాగంలో యానిమేషన్ ఎఫెక్ట్‌తో కూడిన సీ ఆకారపు ఎల్ఈడీ టెయిల్‌లైట్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారు ముందు, వెనుక వైపులా సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్లు అందించారు. కారు లోపల, డ్యాష్‌బోర్డ్ లేయర్డ్ డిజైన్‌ను కలిగి ఉంది. కారు డాష్‌బోర్డ్‌లో 13 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంటుంది. ఈ కారు డ్రైవర్ తల పైన హెడ్-అప్ డిస్‌ప్లే ఉంటుంది.
వివిధ వేరియంట్‌లలో
ఎల్రాక్ 50, ఎల్రాక్ 60, ఎల్రాక్ 85 వంటి 3 వేరియంట్‌లలో విదేశాలలో విక్రయిస్తున్నారు. వేరియంట్‌ను బట్టి 52kWh, 59kWh, 77kWh కెపాసిటీ గల బ్యాటరీలను ఇచ్చారు. అలాగే 100 శాతం చార్జ్‌తో కారు ప్రయాణించగల గరిష్ట దూరం కూడా బ్యాటరీని ఛేంజ్ ఉంటుందని గుర్తుంచుకోవాలి.