7 seater electric car : స్కోడా నుంచి కొత్త 7 సీటర్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ- కియా ఈవీ9కి పోటీగా..-skoda drops teaser for upcoming seven seater electric suv will rival kia ev9 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  7 Seater Electric Car : స్కోడా నుంచి కొత్త 7 సీటర్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ- కియా ఈవీ9కి పోటీగా..

7 seater electric car : స్కోడా నుంచి కొత్త 7 సీటర్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ- కియా ఈవీ9కి పోటీగా..

Sharath Chitturi HT Telugu

Best 7 seater car : ఒక కొత్త 7 సీటర్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని స్కోడా టీజ్​ చేసింది. దీనిని లాంచ్​ చేసేందుకు సంస్థ రెడీ అవుతోంది. ఈ మోడల్​.. కియా ఈవీ9కి గట్టి పోటీని ఇస్తుందని అంచనాలు ఉన్నాయి.

స్కోడా టీజ్​ చేసిన కొత్త 7 సీటర్​ ఈవీ..

దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ స్కోడా నుంచి ఒక ఫ్లాగ్​షిప్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ రాబోతోంది. 2022 విజన్​ 7ఎస్​ కాన్సెప్ట్​ ఆధారంగా తయారవుతున్న ఈ ఈవీని సంస్థ తాజాగా టీజ్​ చేసింది. ఇది బ్రాండ్​కి చెందిన ఆల్​ న్యూ 7 సీటర్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ. అధికారికంగా ధ్రువీకరణ అవ్వనప్పటికీ, ఈ ఈవీ పేరు ‘స్పేస్​’ అని తెలుస్తోంది. ఈ మోడల్​.. కియా ఈవీ9, హ్యుందాయ్​ ఐయానిక్​ 9 వంటి ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలకు గట్టిపోటీని ఇస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్కోడా నుంచి రాబోయే 7 సీటర్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

స్కోడా 7-సీటర్ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ..

రాబోయే స్కోడా ఎలక్ట్రిక్ ఎస్​యూవీ.. బ్రాండ్​ నుంచి వస్తున్న అత్యంత ఖరీదైన ప్రాడెక్ట్​ అవ్వొచ్చు! అంతేకాదు, ఈ ఈవీ.. ప్రస్తుత ఐసీఈ ఫ్లాగ్​షిప్ కొడియాక్ కంటే కాస్త పెద్దదిగా ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఐదు సీట్ల ఇంజిన్- ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఫేస్​లిఫ్ట్ పొందిన ఎన్యాక్ ఈవీ కంటే పెద్దదిగా ఉండనుంది. టీజర్.. మోడల్ స్టైలింగ్ గురించి స్నీక్ పీక్ ఇస్తుంది. సీతాకోకచిలుక ప్రేరేపిత గ్రిల్ విజన్ 7ఎస్ కాన్సెప్ట్​ని పోలి ఉంది. టీ ఆకారంలో ఉన్న ఫ్రెంట్​- రేర్​ ఎల్​ఈడీలు స్పష్టంగా కనిపిస్తాయి.  ఇవి ఎపిక్ ఎస్​యూవీలో కనిపించే వాటి కంటే పెద్దవిగా కనిపిస్తాయి.

స్కోడా ఆటో రాబోయే 7 సీటర్​ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ పవర్ట్రెయిన్ గురించి పెద్దగా వివరాలను పంచుకోలేదు. ఈ మోడల్ ఎంఈబీ ఈవీ ప్లాట్​ఫామ్​పై ఆధారపడి ఉంటుందని సమాచారం. టాప్ వర్షెన్లలో డ్యూయల్-మోటార్ సెటప్​ వస్తుంది. అయితే లో వేరియంట్లలో సింగిల్ మోటార్ లభించే అవకాశం ఉంది. ఇది మార్కెట్​ని బట్టి ఎస్​యూవీకి లో- ఎంట్రీ ధరను నిర్ధారించడానికి సహాయపడుతుంది. విజన్ 7ఎస్ కాన్సెప్ట్​పై 600 కిలోమీటర్ల (డబ్ల్యూఎల్​టీపీ) రేంజ్​ని స్కోడా గతంలో హామీ ఇచ్చింది. ప్రాడక్ట్​-స్పెక్ వర్షెన్​లో బ్రాండ్ అదే సంఖ్యను అందించగలదా అనేది ఆసక్తికరంగా ఉంటుంది! ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వోక్స్​వ్యాగన్ ID.Buzz 472 కిలోమీటర్ల (డబ్ల్యూఎల్​టీపీ) పరిధిని అందిస్తుంది. ఇది అదే ఎంఈబీ ప్లాట్​ఫామ్​పై ఆధారపడి ఉంటుంది.

ఈ స్కోడా 7 సీటర్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ రేంజ్​, ఫీచర్స్​, ధర, లాంచ్​తో పాటున్న మరిన్న వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా, ఈ మోడల్​పై ఇప్పటికే మంచి బజ్​, హైప్​ నెలకొంది. అందుకు తగ్గట్టుగానే సంస్థ కూడా దీని సేల్స్​పై భారీ ఆశలు, అంచనాలు పెట్టుకుంది.

స్కోడా ఆటో లైనప్​..

ఓవైపు ప్రపంచవ్యాప్తంగా కొత్త ఎలక్ట్రిక్ ఎస్​యూవీని తీసుకొచ్చేందుకు ప్లాన్​ చేస్తూనే.. ఈ సంవత్సరం భారతదేశం కోసం అనేక లాంచ్​లను ప్లాన్ చేసింది స్కోడా. చెక్ ఆటోమొబైల్ దిగ్గజం కొత్త ఆక్టేవియా ఆర్ఎస్, న్యూ జనరేషన్ సూపర్బ్​లతో పాటు కొత్త తరం కొడియాక్​ను ఇండియన్​ మార్కెట్లోకి తీసుకురానుంది. కంపెనీ కొత్త ఎన్యాక్ 4ను కూడా తీసుకురావాలని భావిస్తోంది. ఇది భారతదేశానికి బ్రాండ్ నుంచి మొదటి ఎలక్ట్రిక్ ఆఫర్!

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం