Safest Maruti car : సేఫ్టీలో 5 స్టార్​ రేటింగ్​ సాధించిన తొలి మారుతీ కారు ఇదే- ఈ ఫీచర్సే కారణం..-six airbags to 360 degree camera what drives new maruti suzuki dzire to earn 5 star gncap rating ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Safest Maruti Car : సేఫ్టీలో 5 స్టార్​ రేటింగ్​ సాధించిన తొలి మారుతీ కారు ఇదే- ఈ ఫీచర్సే కారణం..

Safest Maruti car : సేఫ్టీలో 5 స్టార్​ రేటింగ్​ సాధించిన తొలి మారుతీ కారు ఇదే- ఈ ఫీచర్సే కారణం..

Sharath Chitturi HT Telugu
Nov 15, 2024 07:11 AM IST

Maruti Suzuki Dzire 2024 : కొత్త తరం మారుతీ సుజుకీ డిజైర్ సబ్ కాంపాక్ట్ సెడాన్ గ్లోబల్ ఎన్​సీఏపీ క్రాష్ టెస్ట్​లో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. మిడిల్​ క్లాస్​, ఫ్యామిలీలకు ఎంతో ఇష్టమైన ఈ సెడన్​లోని సేఫ్టీ ఫీచర్స్​ని ఇక్కడ తెలుసుకోండి.

సరికొత్త మరుతీ సుజుకీ డిజైర్​..
సరికొత్త మరుతీ సుజుకీ డిజైర్​..

కొత్త మారుతీ సుజుకీ డిజైర్ నవంబర్ 11న భారతదేశంలో లాంచ్ అయిన విషయం తెలిసిందే. మిడిల్​ క్లాస్​ కారుగా గుర్తింపు తెచ్చుకున్న డిజైర్​కి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ సబ్ కాంపాక్ట్ సెడాన్ కొత్త తరం మోడల్.. డిజైన్, ఫీచర్ ఫ్రంట్​లో అనేక అప్డేట్స్​ని పొందింది. కొత్త ఇంజిన్​ ఆప్షన్​ కూడా లభించింది. వీటన్నింటికి మించి.. 2024 మారుతీ సుజుకీ డిజైర్, సేఫ్టీ టెస్ట్​లోనూ దుమ్ములేపడం విశేషం! సాధారణంగా మారుతీ వాహనాల్లో సేఫ్టీ పెద్దగా ఉండదు. కానీ ఈ వెహికిల్​ విషయంలో సంస్థ.. భద్రతకు అధిక ప్రాధాన్యతని ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్త డిజైర్​కి గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో ఫైవ్ స్టార్ రేటింగ్​ లభించింది! జీఎన్​సీఏపీ క్రాష్ టెస్ట్​లో ఫైవ్ స్టార్ స్కోరు సాధించిన మొట్టమొదటి మారుతీ సుజుకీ కారుగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇందులోని సేఫ్టీ ఫీచర్స్​ని ఇక్కడ చూసేద్దాము..

మారుతీ సుజుకీ డిజైర్: స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్..

2024 మారుతీ సుజుకీ డిజైర్ సబ్ కాంపాక్ట్ సెడాన్ జాపనీస్ కార్ల తయారీ సంస్థకు చెందిన నెక్స్ట్ జనరేషన్ హార్ట్ ఈసీటీ ప్లాట్ ఫామ్​పై ఆధారపడింది. డిజైర్​కి చెందిన వివిధ వేరియంట్లలో స్టాండర్డ్​గా లభించే అనేక భద్రతా ఫీచర్లతో ఇది లోడ్ అయ్యి ఉంది.

కొత్త తరం మారుతీ సుజుకీ డిజైర్ స్టాండర్డ్​ భద్రతా ఫీచర్లలో డ్యూయల్ ఫ్రంట్, సైడ్- కర్టెన్ ఎయిర్ బ్యాగులతో సహా ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ), హిల్ హోల్డ్ అసిస్ట్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, రేర్ డీఫాగర్, ప్రయాణీకులందరికీ త్రీ-పాయింట్ సీట్ బెల్ట్​లు, హై-స్పీడ్ వార్నింగ్ అలర్ట్, రేర్ డీఫాగర్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాకింగ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజ్​లు వంటి ఇతర ప్రామాణిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. కొత్త డిజైర్​లో ప్రీ-టెన్షన్, ఫోర్స్ లిమిటర్​తో ఫ్రంట్ సీట్ బెల్ట్​లు కూడా ఉన్నాయి. అయితే సీట్ బెల్ట్ రిమైండర్ ల్యాంప్, బజర్ కూడా సెడాన్​కు ప్రామాణిక ఫీచర్ గా అందుబాటులో ఉన్నాయి.

మారుతీ సుజుకీ డిజైర్: ఆప్షనల్ సేఫ్టీ ఫీచర్స్​..

కొత్త తరం మారుతీ సుజుకీ డిజైర్ సబ్ కాంపాక్ట్ సెడాన్​లోని కొన్ని సేఫ్టీ ఫీచర్లు.. హైయ్యర్​ వేరియంట్లలో మాత్రమే లభిస్తాయి. రివర్స్ పార్కింగ్ కెమెరా, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ హెచ్​డీ కెమెరా, యాంటీ థెఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్ (షాక్ సెన్సార్), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), డే/నైట్ అడ్జెస్టెబుల్ ఇన్​సైడ్ రేర్​ వ్యూ మిర్రర్ వంటి ఫీచర్లు నాలుగో తరం డిజైర్ హై వేరియంట్లలో లభిస్తాయి.

మరి ఈ కొత్త మారుతీ సుజుకీ డిజైర్​ని మీరు కొంటున్నారా?

Whats_app_banner

సంబంధిత కథనం