SIP Investment : సిప్‌లో నెలకు రూ.11,111 ఇన్వెస్ట్ చేస్తే.. 15 ఏళ్లలో మీరు ఎంత రాబడి పొందుతారు?
Mutual Funds SIP Investment : మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయి. దీర్ఘకాలంలో భారీగా రిటర్న్స్ పొందవచ్చు. అయితే 15 ఏళ్లపాటు రూ.11111 పెట్టుబడి పెడితే ఎంత వస్తుందో చూద్దాం..
ఆర్థికంగా ఎదగాలని అందరూ కోరుకుంటారు. అయితే దీనికి తగ్గ ప్రణాళిక వేసుకోవాలి. సరైన విధంగా పెట్టుబడి పెడితే పెద్ద మెుత్తంలో వెనకేసుకోవచ్చు. ఇందుకోసం సిప్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం అనేది మంచి పద్ధతి. దీర్ఘకాలిక పెట్టుబడి ద్వారా పెద్ద కార్పస్ లక్ష్యాన్ని సాధించొచ్చు. రిస్క్ ఉన్నప్పటికీ స్థిరమైన పెట్టుబడితో మీరు లాభాలు పొందవచ్చు. మార్కెట్ హెచ్చుతగ్గుల సమయంలో మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్ ఉపసంహరించుకోకుండా ఉంటే ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

సిప్ పెట్టుబడి పెట్టడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. కాంపౌండ్ వడ్డీ అనేది మీ పెట్టుబడులు కాలక్రమేణా విపరీతంగా వృద్ధి చెందేలా చేస్తుంది. భారీ సంపదను నిర్మించడంలో సహాయపడుతుంది. 15 సంవత్సరాలకు నెలకు రూ. 11,111 పెట్టుబడి పెడితే, 10 సంవత్సరాలకు నెలకు రూ. 22,222 ఇన్వెస్ట్ చేస్తే ఎంత రాబడి వస్తుందో చూద్దాం..
15 ఏళ్లలో రాబడి
12 శాతం వార్షిక వడ్డీ రేటుతో దీనిని లెక్కిద్దాం. 15 సంవత్సరాలకు 11,111 నెలవారీ సిప్ 12 శాతం వార్షిక వడ్డీ రేటుతో దాదాపు రూ. 56.06 లక్షల కార్పస్‌గా పెరుగుతుంది. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసినది రూ.19,99,980. వడ్డీగా రూ. 36.06 లక్షలు వరకు వస్తుంది.
10 ఏళ్లలో రాబడి
10 సంవత్సరాలకు 22,222 నెలవారీ సిప్ మొత్తం రూ. 51.63 లక్షలు అవుతుంది. రూ. 51.63 లక్షల కార్పస్‌లో రూ. 26.66 లక్షలు మీరు ఇన్వెస్ట్ చేసింది. రూ.24,96,399 మీరు రాబడిగా పొందుతారు. ఇలా సిప్‌లో దీర్ఘకాలిక పెట్టుబడి ద్వారా భారీ లాభాలను ఆర్జించవచ్చు. సిప్ పెట్టుబడులు తరచుగా మార్కెట్ లాభాలు, నష్టాలతో ముడిపడి ఉంటాయని గుర్తుంచుకోవాలి.
ప్లాన్ చేసి ఇన్వెస్ట్ చేయాలి
సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అనేది పెట్టుబడిదారులు ఎక్కువగా ఆసక్తి చూపించే పద్ధతి. సరిగ్గా పెట్టుబడి పెట్టినట్లయితే సంపదను పెంచుకోవచ్చు. మీ బ్యాంక్ ఖాతా సిప్‌తో లింక్ అయి ఉంటే డిపాజిట్లను కొనసాగించడం సులభం. మీ ఖాతా నుండి మొత్తం ఒక నిర్దిష్ట తేదీన సిప్‌కి చేరుతుంది. SIP పెట్టుబడిని ప్రారంభించే ముందు ఫండ్ పనితీరును అంచనా వేసిన తర్వాత సిప్‌ని ఎంచుకోవచ్చు. ఏదైనా సిప్‌లో రూ. 100 నుండి పెట్టుబడిని ప్రారంభించవచ్చు.
గమనిక : స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నది. సిప్‌లో రాబడులు కొన్నిసార్లు ఎక్కువ రావొచ్చు, తక్కువ రావొచ్చు. మార్కెట్ హెచ్చుతగ్గుల మీద ఆధారపడి ఇది ఉంటుంది.