Electric scooters : మిడిల్​క్లాస్​ వారి ముందుకు రెండు హై-రేంజ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్లు! ఏది బెస్ట్​?-simple ones vs ather 450s which electric scooter will you pick ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Scooters : మిడిల్​క్లాస్​ వారి ముందుకు రెండు హై-రేంజ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్లు! ఏది బెస్ట్​?

Electric scooters : మిడిల్​క్లాస్​ వారి ముందుకు రెండు హై-రేంజ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్లు! ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu
Published Mar 14, 2025 05:48 AM IST

Simple OneS vs Ather 450S : సింపుల్ వన్​ఎస్​ వర్సెస్ ఏథర్ 450ఎస్.. ఈ రెండు ఎలక్ట్రిక్​ స్కూటర్స్​లో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? దేని రేంజ్​ ఎక్కువ? పూర్తి వివరాలు..

సింపుల్​ వన్​ఎస్​ వర్సెస్​ ఏథర్​ 450ఎస్​
సింపుల్​ వన్​ఎస్​ వర్సెస్​ ఏథర్​ 450ఎస్​

ఇండియన్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ మార్కెట్​లో ప్రజలకు మరొక ఆప్షన్​ తాజాగా అందుబాటులోకి వచ్చింది. దాని పేరు సింపుల్​ వన్​ఎస్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​. సింపుల్ ఎనర్జీ లైనప్​లో ఈ ఈ-స్కూటర్​ అత్యంత సరసమైన ఆఫర్​గా నిలిచింది. ఈ మోడల్​.. ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటైన ఏథర్ 450ఎస్​కు గట్టి పోటీ ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

సింపుల్ వన్​ఎస్​ వర్సెస్ ఏథర్ 450ఎస్: బ్యాటరీ- రేంజ్..

సింపుల్ వన్​ఎస్ ఎలక్ట్రిక్​ స్కూటర్​​ 3.7 కిలోవాట్ల ఫిక్స్​డ్​ బ్యాటరీ ప్యాక్​ని పొందుతుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 181 కిలోమీటర్ల రేంజ్​ని ఇస్తుంది. ఇదే సంస్థకు చెందిన మునుపటి డాట్ వన్ మోడల్​తో పోలిస్తే ఇది 21 కిలోమీటర్లు అధికం! అదనంగా, వన్ఎస్ ఫాస్ట్ ఛార్జింగ్​ని పొందుతుంది. ఇది రోజువారీ ప్రయాణానికి మంచి ఆప్షన్​గా మారుతుంది. 3-4 గంటల ఛార్జింగ్ సమయంతో, వినియోగదారులు ఇంట్లో లేదా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్​లలో బ్యాటరీని త్వరగా రీఛార్జ్ చేయవచ్చు.

ఇక ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్​లో 2.9 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 115 కిలోమీటర్ల రేంజ్​ని ఇస్తుంది.

సింపుల్ వన్​ఎస్​ వర్సెస్ ఏథర్ 450ఎస్: పర్ఫార్మెన్స్..​

సింపుల్ వన్​ఎస్​ 8.5 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది. ఇది 72 ఎన్ఎమ్ పీక్​ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈ-స్కూటర్ సోనిక్ మోడ్​లో ప్రయాణించేటప్పుడు 0-40 కిలోమీటర్ల వేగాన్ని 2.5 సెకన్లలో అందుకుంటుంది! దీని టాప్​ స్పీడ్​ గంటకు 105 కిలోమీటర్లు!

ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్​ స్కూటర్​ 3.9 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

సింపుల్ వన్​ఎస్​ వర్సెస్ ఏథర్ 450ఎస్: ఫీచర్లు

సింపుల్ వన్​ఎస్​లో 7 ఇంచ్​ టచ్​స్క్రీన్ డ్యాష్​బోర్డ్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నాయి. టర్న్ బై టర్న్ నావిగేషన్, ఓవర్-ది-ఎయిర్ (ఓటీఏ) సాఫ్ట్​వేర్​ అప్డేట్స్, వాహన స్థితి- బ్యాటరీ స్థాయిని ట్రాక్ చేయడానికి యాప్ కనెక్టివిటీ, డిస్​ప్లే ఇంటర్ఫేస్​ని కస్టమైజ్ చేసే కస్టమైజెబుల్ థీమ్స్, వై-ఫై కనెక్టివిటీతో 5జీ సిమ్ సపోర్ట్ వంటి ఇతర టెక్ ఫీచర్లు ఉన్నాయి.

ఏథర్ 450ఎస్ కలర్ ఎల్​సీడీ స్క్రీన్, మొబైల్ యాప్ కనెక్టివిటీతో వస్తుంది. ఏథర్ 450ఎస్ ప్రో ప్యాక్​లో రైడ్ అసిస్ట్, ఏథర్ బ్యాటరీ ప్రొటెక్ట్, ఏథర్​స్టాక్​ అప్డేట్స్​, అదనపు రైడింగ్ మోడ్లు ఉన్నాయి.

సింపుల్ వన్ఎస్ వర్సెస్ ఏథర్ 450ఎస్: ధర

సంస్థ లైనప్​లో అత్యంత సరసమైన మోడల్ ఈ సింపుల్ వన్​ఎస్ ఎలక్ట్రిక్​ స్కూటర్​​. దీని ఎక్స్​షోరూం ధర రూ.1.40 లక్షలు! కాగా 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​తో సింగిల్ ట్రిమ్ ఆప్షన్​లో మాత్రమే ఇది లభిస్తుంది.

మరోవైపు 450ఎస్ స్టాండర్డ్ మోడల్ ధర రూ .1.46 లక్షలు. ప్రో ప్యాక్ ఆప్షన్ రూ .1.60 లక్షల వరకు ఉంటుంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం