Stocks to buy : మార్కెట్ల పతనంలోనూ 285శాతం పెరిగిన స్టాక్​ ఇది- ఇప్పుడు బిగ్​ అప్డేట్​..-shukra pharmaceuticals announces stock split check details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy : మార్కెట్ల పతనంలోనూ 285శాతం పెరిగిన స్టాక్​ ఇది- ఇప్పుడు బిగ్​ అప్డేట్​..

Stocks to buy : మార్కెట్ల పతనంలోనూ 285శాతం పెరిగిన స్టాక్​ ఇది- ఇప్పుడు బిగ్​ అప్డేట్​..

Sharath Chitturi HT Telugu

Stocks to buy today : ఓవైపు మార్కెట్లు పడుతుంటే మరోవైపు శుక్ర ఫార్మా స్టాక్​ 6 నెలల్లో ఏకంగా 285.9శాతం పెరిగింది. ఇప్పుడు ఈ సంస్థ నుంచి ఒక బిగ్​ అప్డేట్​ ఉంది. అదేంటంటే..

భారీగా పెరిగిన ఈ స్టాక్​ నుంచి ఇప్పుడు మరో వార్త!

గతేడాది రెండో భాగం నుంచి దేశీయ స్టాక్​ మార్కెట్​లు విపరీతమైన నష్టాలను చూస్తున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​, ఎన్​ఎస్​ఈ నిఫ్టీ వంటి ప్రధాన సూచీలు భారీ మొత్తంలో నష్టపోయాయి. అయితే, మార్కెట్​లు డౌన్​లో ఉన్న కొన్ని కంపెనీల స్టాక్స్​ మాత్రం లాభాల్లో దూసుకెళుతున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి శుక్ర ఫార్మాస్యూటికల్స్​! ఈ కంపెనీ షేర్లు 6 నెలల్లో ఏకంగా 285.9శాత రిటర్నులు ఇచ్చాయి. ఇక ఇప్పుడు ఈ కంపెనీ నుంచి మరొక బిగ్​ అప్డేట్​ వచ్చింది. శుక్ర ఫార్మా కంపెనీ స్టాక్​ స్ల్పిట్​ని ప్రకటించింది. కంపెనీ షేర్లను 10 భాగాలుగా విభజిస్తారు. ఈ స్టాక్ డివిజన్​ తర్వాత కంపెనీ షేరు ముఖ విలువ రూ.1కి పడిపోతుంది. కంపెనీ స్టాక్ విభజనకు రికార్డు తేదీని సైతం ప్రకటించింది. ఆ వివరాలు..

శుక్ర ఫార్మా స్టాక్​ ప్రైజ్​..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో శుక్ర ఫార్మా షేరు రూ. 245.8 వద్ద అప్పర్​ సర్క్యూట్​లో క్లోజ్​ అయ్యింది. ఐదు రోజుల్లో ఈ సంస్థ షేరు దాదాపు 4శాతం పెరిగింది. నెల రోజుల్లో ఏకంగా 21.3శాతం వృద్ధిచెందింది. ఇక ఆరు నెలల వ్యవధిలో ఈ శుక్ర ఫార్మా స్టాక్​ 285.9శాతం పెరిగింది. ఏడాది కాలంలో 261.6శాతం, ఐదేళ్ల కాలంలో ఏకంగా 9,501శాతం వృద్ధిచెందింది.

అటు 6 నెలల వ్యవధిలో బీఎస్​ఈ సెన్సెక్స్​ 11శాతం, ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 11.7శాతం పతనమయ్యాయి.

స్టాక్​ స్ల్పిట్​ అప్డేట్​..

శుక్ర ఫార్మా స్టాక్​ను 10 ముక్కలుగా విభజించనున్నట్లు స్టాక్ ఎక్స్​ఛేంజ్​లకు ఇచ్చిన సమాచారంలో సంస్థ పేర్కొంది. స్టాక్ విభజనకు మార్చ్​ 21న రికార్డు తేదీని బోర్డు నిర్ణయించిందని కంపెనీ తెలిపింది.

ఏడాది క్రితం ఈ కంపెనీ స్టాక్.. మార్కెట్లలో ఎక్స్​బోనస్ ట్రేడ్​ అయ్యింది. అప్పుడు కంపెనీ ఒక షేరుపై బోనస్​గా 3 షేర్లను పంపిణీ చేసింది. 2024 సెప్టెంబర్ నెలలోనే కంపెనీ ఎక్స్​డివిడెండ్ ట్రేడింగ్​ని ప్రారంభించింది. అప్పుడు కూడా అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు ఒక షేరు తరఫున ఒక రూపాయి డివిడెండ్ ఇచ్చింది!

అయితే, కేవలం స్టాక్​ స్ల్పిట్​, డివిడెండ్​లను చూసి సదరు కంపెనీలో ఇన్వెస్ట్​ చేయడం ఉత్తమం కాదని గ్రహించాలి. ఒక స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు దాని ఫండమెంటల్​ ఎనాలసిస్​, రిస్క్​ వంటివి తెలుసుకోవడం చాలా అవసరం.

(గమనిక- ఇది పెట్టుబడి సలహా కాదు. ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధ లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు మీరు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించాల్సి ఉంటుంది.)

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం