Hero Passion Plus vs Bajaj Platina 100 : ప్యాషన్ ప్లస్- ప్లాటీనా 100.. ఏది కొంటే బెటర్?
Hero Passion Plus vs Bajaj Platina 100 : హీరో ప్యాషన్ ప్లస్ 2023 వర్షెన్‌ను సంస్థ ఇటీవలే రివీల్ చేసింది. దీనిని బజాజ్ ప్లాటీనా 100తో పోల్చి ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
Hero Passion Plus vs Bajaj Platina 100 : సంస్థకు చెందిన బెస్ట్ సెల్లింగ్ మోడల్ ప్యాషన్ ప్లస్‌కు 2023 వర్షెన్‌ను తీసుకొచ్చింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హీరో మోటోకార్ప్. త్వరలోనే ఇది లాంచ్ అవ్వనుంది. కాగా.. ఈ మోడల్.. బజాజ్ ప్లాటీనా 100కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
హీరో ప్యాషన్ ప్లస్ వర్సెస్ బజాజ్ ప్లాటీనా 100- స్పెసిఫికేషన్స్..
హీరో ప్యాషన్ ప్లస్‌లో మస్క్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్, సెమీ ఫైర్డ్ హెడ్‌ల్యాంప్, ఫ్లాట్ టైప్ సీట్, వైడ్ హ్యాండిల్‌బార్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లు లభిస్తున్నాయి. డిజైన్ చాలా మాడర్న్‌గా కనిపిస్తుంది.
Bajaj Platina 100 on road price : బజాజ్ ప్లాటీనా 100లో స్కల్ప్టెడ్ ఫ్యూయెల్ ట్యాంక్, రైజ్డ్ హ్యాండిల్‌బార్, హాలోజెన్ హెడ్‌ల్యాంప్, సింగిల్ పీస్ సీట్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తున్నాయి.
ఈ రెండు బైక్స్‌లోనూ అలాయ్ వీల్స్ ఉన్నాయి.
ఈ రెండు బైక్స్‌లో ఏది బరువు ఎక్కువ..?
Hero Passion Plus 2023 : హీరో బైక్ సీట్ హైట్ 790ఎంఎం. గ్రౌండ్ క్లియరెన్స్ 168ఎంఎం. కర్బ్ వెయిట్ 115కేజీలు.
ఇక బాజజ్ బైక్ సీట్ హైట్ 807ఎంఎం. గ్రౌండ్ క్లియరెన్స్ 200ఎంఎం. బరువు 117కేజీలు.
అంటే.. ఈ రెండు బైక్స్ బరువు దాదాపు సమానంగానే ఉంటుంది.
ఇదీ చూడండి:- Honda Dio H-Smart vs Yamaha RayZR 125 Fi : ఈ రెండు స్కూటర్లలో ఏది బెస్ట్?
హీరో- బజాజ్ బైక్స్ ఇంజిన్..
సరికొత్త హీరో ప్యాషన్ ప్లస్‌లో 97.2 సీసీ, ఎయిర్ కూల్డ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ సింగిల్ సిలిండర్, బాక్సర్ టైప్ ఇంజిన్ వస్తోంది. స్ప్లెండర్ ప్లస్‌లోనూ ఇదే ఇంజిన్ కనిపిస్తుంది. ఇది 7.9 హెచ్‌పీ పవర్‌ను, 8.05 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
Hero Passion Plus new model : మరోవైపు బజాజ్ ప్లాటీనా 100లో 102సీసీ, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ డీటీఎస్-ఐ ఇంజిన్ ఉంటుంది. ఇది 7.8 హెచ్‌పీ పవర్‌ను, 8.3 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఈ రెండు బైక్స్‌లోనూ 4 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది.
ఇక సేఫ్టీ విషయానికొస్తే.. ఈ రెండు వాహనాల్లో ఫ్రెంట్, రేర్ వీల్స్‌కు డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టెమ్ ఫీచర్ కూడా ఉంది. వీటిల్లో.. ఫ్రెంట్ సైడ్‌కు టెలిస్కోపిక్ ఫోర్క్స్, రేర్‌లో డ్యూయెల్ షాక్ అబ్సార్బర్స్ వంటివి సస్పెషన్స్ డ్యూటీ చేస్తాయి.
ఈ బైక్స్ ధరలు ఎంత..?
Bajaj Platina 100 on road price Hyderabad : ఇండియాలో హీరో ప్యాషన్ ప్లస్ ఎక్స్‌షోరూం ధర రూ. 72,076గా ఉంది. అదే సమయంలో బజాజ్ ప్లాటీనా 100 ఎక్స్‌షోరూం ధర రూ. 67,808గా ఉంది.
సంబంధిత కథనం